కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా అర్ధరాత్రి నిర్ణయాలు చేస్తూ ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు.
సీపీఐ నేత కె.నారాయణ
తిరుపతి కల్చరల్: కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా అర్ధరాత్రి నిర్ణయాలు చేస్తూ ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు. మంగళవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దుపై ఈనెల 25న కాగడాల ప్రదర్శన నిర్వహిస్తామని నారాయణ ప్రకటించారు.
26న పార్టీ కార్యాలయాల ముందు జాతీయ పతాన్ని ఎగురవేసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరతామన్నారు. 30న గాంధీని హత్య చేసినరోజును చీకటిరోజుగా పరిగణించి ఆ పరిణామాల్ని ప్రజలకు వివరిస్తామన్నారు.