బాబు వెయ్యికళ్లతో బీజేపీ వైపు....
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీతో పొత్తు కాదని...కేవలం సీట్ల సర్దుబాటు మాత్రమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. చర్చల్లో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతుందన్ని ఆయన గురువారమిక్కడ అన్నారు. తెలంగాణ మేనిఫెస్టోను నారాయణ విడుదల చేశారు.
చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్దాంతం కాస్తా వెయ్యికళ్లతో బీజేపీ వైపు వెళుతున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్...మోడీతో చేతులు కలపటం దురదృష్టకరమన్నారు. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేసీఆర్తో వన్సైడ్ లవ్లో ఉన్నారని ఆయన అన్నారు.