
సాక్షి, హైదరాబాద్: శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలో 29, 108 సర్వే నెంబర్‌లో ఉన్న 185 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని దీనిపై తక్షణమే ప్రభుత్వం విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
ఈ మేరకు బుధవారం సచివాలయంలో సీఎస్ ఎస్‌కే జోషిని చాడ బృందం కలిసి విన్నవించింది. నెంబర్ 87లో ఉన్న 52 ఎకరాల భూమిని యజమానుల నుంచి తీసుకుని ప్రభుత్వం కలెక్టర్ కార్యాల యం నిర్మిస్తోందని పేర్కొన్నారు. భూ యజమానులకు నష్ట పరిహారం, భూమి ఇవ్వాలని కోరారు.