ఖమ్మం రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఉదయం రైలు దిగుతూ జారి పడి రామకృష్ణ(23) అనే విద్యార్థి మృతిచెందాడు. కోచింగ్ నిమిత్తం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రామకృష్ణది చింతూరు మండలం ఎర్రసీతనపల్లి గ్రామం. రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.