ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమై ప్రజా ద్రోహిగా మిగిలారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ విమర్శించారు. బుధవారం అనంతపురంలో కేంద్రప్రభుత్వ కార్యాలయాల ముట్టడి చేపట్టిన తమ నాయకులపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేవరకు తమ పోరాటాలు ఆపమన్నారు. అంద రిని కలుపుకుని ఉద్యమిస్తామన్నారు.
బుక్కరాయసముద్రం: రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు తీవ్ర అన్యాయం చేసి ప్రజాద్రోహిగా ముద్ద వేసుకున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ విమర్శించారు. రిమాండ్‌లో ఉన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ, జిల్లా కార్యదర్శి జగదీష్, ఇతర నాయకులను ములాఖత్ ద్వారా శుక్రవారం ఆయన జిల్లా జైలులో కలిశారు. అనంతరం ఆయన మీడియా వారితో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పనలో చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారన్నారు. కేంద్ర మంతి వెంకటయ్య నాయుడు 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పిన మాట ఎందుకు నిలబెట్టుకోలేక పోయారన్నారు. రాష్ట్రాన్ని బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు నట్టేట ముంచాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పొందు పరచిన హామీలు అప్పటిలో కేంద్ర కేబినెట్, పార్లమెంట్ ఆమోదం తెలిపాయన్నారు.
ఈ విషయంపై కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిలదీయ లేక పోతోందన్నారు. తెలుగు ప్రజల హక్కులు సాధించేం దుకు రాజకీయ పోరాటం చేస్తారా? లేదా భిక్షాందేహి అంటూ భిక్ష పాత్ర పట్టుకుని ఢిల్లీలో అడుక్కు తింటారా? తేల్చుకోండని చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇంత అన్యాయం జరుగుతున్నా కేంద్ర మంత్రి పదవులలో ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. వెంటనే బీజేపీతో తెగతెంపులు చేసుకునే దమ్ము ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. సీఎంకు, మంత్రులకు ఏమాత్రం చిత్త శుద్ధి ఉన్నా మంత్రి పదవులను త్యజించి పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. లేదంటే ప్రజా ద్రోహులుగా నిలిచి పోతారన్నారు. అనంతపురం నుంచి పోరాటాలకు నాంది మాత్రమేనన్నారు.
ఏప్రిల్ నుంచి రాష్ట్రమంతటా రాజకీయ నాయకుల మద్దతు కూడగట్టుకుని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. సీపీఐ నేతలను బేషరతుగా వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ విషయంలో ముఖ్య మంత్రి చంద్రబాబు జోక్యం చేసుకోవాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణతో సహా ఏడుగురిపై నాన్‌బె యిల బుల్ కేసులు నమోదు చేయడాన్ని నారాయణ తీవ్రంగా ఖండించారు. సీపీఐ నేతలు రాజారెడ్డి, జాఫర్, రమణ, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు ప్రజాద్రోహి
Published Sat, Mar 14 2015 2:44 AM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM
Advertisement