సస్పెన్స్ థ్రిల్లర్‌ | Unda leda ia a suspense thriller | Sakshi
Sakshi News home page

సస్పెన్స్ థ్రిల్లర్‌

Published Tue, Feb 14 2017 11:18 PM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM

సస్పెన్స్  థ్రిల్లర్‌

సస్పెన్స్ థ్రిల్లర్‌

రామకృష్ణ, అంకిత జంటగా సస్పెన్స్, థ్రిల్లర్‌ కథతో తెరకెక్కిన చిత్రం ‘ఉందా..లేదా?’. వెంకట శివప్రసాద్‌ దర్శకత్వంలో జయకమల్‌ ఆర్ట్‌ బ్యానర్‌పై అమనిగంటి అయితం ఎస్‌.కమల్‌ నిర్మించారు. శ్రీ మురళి స్వరపరిచిన ఈ చిత్రంలోని రెండు పాటలను దర్శకుడు మారుతి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ–‘‘టైటిల్‌ క్యాచీగా, టీజర్‌ ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ చిత్రంలోని ‘ఉందా లేదా..’ టైటిల్‌ సాంగ్‌ నాకు బాగా నచ్చింది.

ఈ సినిమా హిట్‌ సాధించి, యూనిట్‌కు మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ–‘‘ సస్పెన్స్ , థ్రిల్లర్‌ నేపథ్యంలో మా చిత్రం తెరకెక్కింది. ఇందులో సన్నివేశాలు ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తాయి. టీజర్‌కు మంచి రెస్పాన్స్  వస్తోంది. మారుతిగారు పాటలు విడుదల చేయడం హ్యాపీ. అన్నివర్గాల ప్రేక్షకులు మెచ్చే వాణిజ్య హంగులున్న చిత్రమిది’’ అన్నారు. ఎస్‌.కమల్, రామకృష్ణ, అంకిత, శ్రీమురళి, హాస్యనటుడు సాయి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్‌ కె. బంగారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement