అనంతపురం : అనంతపురం నగరంలోని స్థానిక పీటీసీ సమీపంలో ఓవర్ బ్రిడ్జి వద్ద గురువారం ఓ వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పాతూరులోని ఐలమ్మ కాలనీకి చెందిన చాకలి రామకృష్ణ (49) మునిసిపల్ కాంప్లెక్స్‌లో ఉన్న ఓ డ్రైక్లీనింగ్ దుకాణంలో పని చేస్తుండేవాడు. ఈయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ నెల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బుధవారం తిరిగి వచ్చాడు. పని చేసే దుకాణానికి వెళ్లి డబ్బులు ఇప్పించుకుని మద్యం సేవించాడు.
తర్వాత ఎక్కడికి పోయాడో తెలీదు. గురువారం రైలు పట్టాలపై శవమై కనిపించాడు. ఇదే చోట రెండు పందులు కూడా మృతి చెందాయి. ఏమైనా పందుల పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెంది ఉంటాడా ? అనే కోణంలో విచారిస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటే శవాన్ని రైలు లాక్కెల్లే అవకాశాలు తక్కువగా ఉంటాయని, అయితే రామకృష్ణ మృతదేహం సుమారు పది అడుగుల మేరకు లాక్కెళ్లిన ఆనవాళ్లు పోలీసులు గుర్తించారు.
దీంతో ప్రమాదవశాత్తూ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్‌ఐ ఇస్మాయిల్ ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రైలు కింద పడి వ్యక్తి మృతి
Published Thu, May 7 2015 10:34 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
Advertisement
Advertisement