trains accident
-
ఒడిశా రైలు ప్రమాద ఘటన.. నిందితుల రిమాండ్ పొడిగింపు
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ స్టేషన్ వద్ద ట్రిపుల్ ట్రైన్స్ యాక్సిడెంట్ కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్‌ను భువనేశ్వర్ ప్రత్యేక సీబీఐ కోర్టు పొడిగించేందుకు అనుమతించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అభ్యర్థన మేరకు కోర్టు అంగీకారం తెలిపింది. లోగడ జూలై 7న నిందితులకు 5 రోజుల రిమాండ్‌ను కోర్టు మంజూరు చేసింది. రిమాండ్‌ను మరో నాలుగు రోజులు పొడిగించాలని కోర్టుకు దరఖాస్తు చేయడంతో అనుమతించినట్లు మంగళవారం కోర్టు ప్రకటించింది. ఈ సందర్భంగా నిందితులు సీనియర్ సెక్షన్ ఇంజినీర్ (సిగ్నల్) అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్ మరియు టెక్నీషియన్ పప్పు కుమార్‌ని కోర్టులో హాజరుపరిచారు. లోతుగా విచారణ ఈ దుర్ఘటన వెనక అసలు నిజాలు బట్టబయలు చేసే దిశలో సీబీఐ విచారణ లోతుగా కొనసాగుతోంది. తొలి దశలో ముగ్గురుని అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్న దర్యాప్తు బృందం తాజాగా మరో ఇద్దరు రైల్వే సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. వీరిలో బహనాగా బజార్ రైల్వేస్టేషను మాస్టర్ ఒకరు. సీబీఐ వీరిని సోమవారం నుంచి విచారించింది. స్టేషను మాస్టరుతో సహా మరో సిబ్బందిని ప్రశ్నించింది. కాగా తాజాగా మరో ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. వీరిని బుధవారం నుంచి ప్రశ్నించడం ఆరంభిస్తుంది. ఈ లెక్కన దర్యాప్తు బృందం 8 మందిపై దృష్టి సారించింది. లోగడ ముగ్గురు నిందితులను జూలై 7న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరికి వ్యతిరేకంగా ఐపీసీ సెక్షన్లు 304 (హత్య కాకున్న మరణానికి హేతువు) మరియు 201 (సాక్ష్యాధారాల గల్లంతు) కింద కేసులు నమోదు చేశారు. వీరిలో అరుణ్ కుమార్ మహంత మరియు అమీర్ ఖాన్ బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. సీఆర్ఎస్ విచారణలో... రైల్వే భద్రతా కమిషనర్ (ఆగ్నేయ సర్కిల్) సీఆర్ఎస్ విచారణ నివేదికలో నార్త్ సిగ్నల్ గూమ్టీ (స్టేషన్) వద్ద సిగ్నలింగ్ సర్క్యూట్ మార్పులో లోపం కారణంగా ప్రమాదం జరిగిందని పేర్కొంది. జూన్ 2వ తేదీ సాయంత్రం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బహనాగా బజార్ స్టేషన్లో స్థిరంగా ఉన్న సరుకు రవాణా రైలును ఢీకొట్టింది. అనంతరం దాని పట్టాలు తప్పిన కొన్ని కోచ్‌లను పక్క ట్రాక్‌పై వస్తున్న యశ్వంత్‌పూర్–హౌరా ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 293 మంది మరణించారు. ఇప్పటికీ పలువురి ఆచూకీ తెలియక మృతదేహాలు కంటైనర్లలో మగ్గుతున్నాయి. స్థానిక ఎయిమ్స్ ప్రాంగణంలో కంటైనర్లలో 41 శవాలు ఆచూకీ కోసం నిరీక్షిస్తున్నాయి. వీటిలో 10 శవాల డీఎన్ఏ పరీక్షల నివేదిక అందడంతో బంధు వర్గాలకు అప్పగించేందుకు సన్నాహాలు చేపట్టారు. నిబంధనల మేరకు మృతదేహాలను అప్పగిస్తారు. స్వస్థలాలకు తరలించలేని పరిస్థితుల్లో స్థానికంగా అంత్యక్రియలు ఉచితంగా నిర్వహించేందుకు స్థానిక నగర పాలక సంస్థ ఏర్పాట్లు చేసింది. -
మరో ప్రమాదం.. లూప్ లైన్లో ఉన్న రైలును ఢీకొన్న గూడ్స్
కోల్కత్తా: ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటన మరువక ముందే మరో ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సిగ్నలింగ్ వ్యవస్థలో నిర్లక్ష్యం కారణంగా రెండు గూడ్స్ రైళ్లు పట్టాలపై ఢీకొన్నాయి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బెంగాల్లో బంకూర ప్రాంతంలోని ఓండా స్టేషన్ వద్ద లూప్లైన్లో ఉన్న గూడ్స్ రైలును మరో గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రైలు ఇంజిన్, బోగీలు పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. 12 బోగీలు పట్టాలపై పడిపోయాయి. ఇక, ఈ ప్రమాదంలో ఒక రైలు లోకోపైలట్‌కు గాయాలైనట్టు సమాచారం. ఈ ప్రమాదంపై రైల్వే ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. ప్రమాదం జరిగిన తీరుపై, కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే, రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వే అధికారులు స్పష్టం చేశారు. పలు రైళ్లు రద్దు.. ఈ ప్రమాదంతో 14 రైళ్లను ఈరోజు రద్దు చేసినట్లు సౌత్ ఈస్ట్రన్ రైల్వే ప్రకటించింది. మరికొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేశామని.. కొన్ని రైళ్లను దారి మళ్లించామని తెలిపింది. ఈ మేరకు ఆ వివరాలను ట్విటర్ ద్వారా వెల్లడించింది. #ser #IndianRailways pic.twitter.com/WtvccLPEyR — South Eastern Railway (@serailwaykol) June 25, 2023 ఇది కూడా చదవండి: ఇసుకలో సిమెంట్ కూడా కలపాలి మహాప్రభో!.. బీహార్‌లో కూలిన రెండో వంతెన! -
Odisha Train Accident: ఇటు రైలు ప్రమాదం.. అటు.. బస్సు ఛార్జీల పెంపు..!
ఒడిశా:ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైళ్ల భీకర ప్రమాదంతో పూరీకి వెళ్లే మార్గంలో అటు బంగాల్ నుంచి రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. దీంతో బస్సుల ఛార్జీలు ఆకాశాన్నంటుతున్నాయి. బస్సు యజమానులు ఛార్జీలను ఒక్కసారిగా మూడొంతులకు పెంచేశారని ప్రయాణికులు వాపోతున్నారు. 'జగన్నాథ్ స్నాన్ యాత్ర' రేపు జరగనుంది. భక్తులు పూరీకి పెద్ద సంఖ్యలో వెళుతుంటారు. బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంతో రైళ్ల రాకపోకలను సౌత్-ఈస్ట్రన్ రైల్వే నిలిపివేసింది. దీంతో ప్రయాణికులు బస్సు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ అవకాశాన్ని వాడుకుని బస్సు ఛార్జీలను యజమానులు అమాంతం పెంచేశారని ప్రయాణికులు తెలిపారు. భద్రక్, కటక్, పూరీ మీదుగా వెళ్లే బస్సు ఛార్జీ సాధారణంగా రూ.400, 600, 800 ఉండేది. కానీ ప్రస్తుతం రూ.1200 నుంచి 1500 వెచ్చించాల్సి వస్తోందని స్థానికులు తెలిపారు. మరికొంత మంది ఏజెంట్లు రూ.2000 నుంచి 2500 వరకు అడుగుతున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన భీకర రైళ్ల ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 280కు చేరింది. బెంగళూరు- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో 900 మంది గాయపడ్డారు. ఇదీ చదవండి:'కన్న కొడుకు మృతదేహాన్ని చేతులతో మోస్తూ..' రైలు ప్రమాదంలో చెదిరిన మధ్యతరగతి కుటుంబాలెన్నో.. -
ముంబైలో వర్షాలు : భారీగా ట్రాఫిక్ జామ్
-
రైలు కింద పడి వ్యక్తి మృతి
అనంతపురం : అనంతపురం నగరంలోని స్థానిక పీటీసీ సమీపంలో ఓవర్ బ్రిడ్జి వద్ద గురువారం ఓ వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పాతూరులోని ఐలమ్మ కాలనీకి చెందిన చాకలి రామకృష్ణ (49) మునిసిపల్ కాంప్లెక్స్‌లో ఉన్న ఓ డ్రైక్లీనింగ్ దుకాణంలో పని చేస్తుండేవాడు. ఈయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ నెల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బుధవారం తిరిగి వచ్చాడు. పని చేసే దుకాణానికి వెళ్లి డబ్బులు ఇప్పించుకుని మద్యం సేవించాడు. తర్వాత ఎక్కడికి పోయాడో తెలీదు. గురువారం రైలు పట్టాలపై శవమై కనిపించాడు. ఇదే చోట రెండు పందులు కూడా మృతి చెందాయి. ఏమైనా పందుల పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెంది ఉంటాడా ? అనే కోణంలో విచారిస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటే శవాన్ని రైలు లాక్కెల్లే అవకాశాలు తక్కువగా ఉంటాయని, అయితే రామకృష్ణ మృతదేహం సుమారు పది అడుగుల మేరకు లాక్కెళ్లిన ఆనవాళ్లు పోలీసులు గుర్తించారు. దీంతో ప్రమాదవశాత్తూ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్ఐ ఇస్మాయిల్ ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.