మరో ప్రమాదం.. లూప్‌ లైన్‌లో ఉన్న రైలును ఢీకొన్న గూడ్స్‌ | Goods Train Collide Another Train At West Bengal Bankura | Sakshi
Sakshi News home page

మరోసారి సిగ్నలింగ్‌ వ్యవస్థ ఫెయిల్‌.. లూప్‌ లైన్‌లో ఉన్న రైలును ఢీకొన్న గూడ్స్‌

Published Sun, Jun 25 2023 8:33 AM | Last Updated on Sun, Jun 25 2023 9:48 AM

Goods Train Collide Another Train At West Bengal Bankura - Sakshi

కోల్‌కత్తా: ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటన మరువక ముందే మరో ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సిగ్నలింగ్‌ వ్యవస్థలో నిర్లక్ష్యం కారణంగా రెండు గూడ్స్‌ రైళ్లు పట్టాలపై ఢీకొన్నాయి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. బెంగాల్‌లో బంకూర ప్రాంతంలోని ఓండా స్టేషన్‌ వద్ద లూప్‌లైన్‌లో ఉన్న గూడ్స్‌ రైలును మరో గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రైలు ఇంజిన్‌, బోగీలు పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. 12 బోగీలు పట్టాలపై పడిపోయాయి. ఇక, ఈ ప్రమాదంలో ఒక రైలు లోకోపైలట్‌కు గాయాలైనట్టు సమాచారం. 

ఈ ప్రమాదంపై రైల్వే ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. ప్రమాదం జరిగిన తీరుపై, కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే, రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వే అధికారులు స్పష్టం చేశారు. 

పలు రైళ్లు రద్దు.
ఈ ప్రమాదంతో 14 రైళ్లను ఈరోజు రద్దు చేసినట్లు సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే ప్రకటించింది. మరికొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేశామని.. కొన్ని రైళ్లను దారి మళ్లించామని తెలిపింది. ఈ మేరకు ఆ వివరాలను ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.

ఇది కూడా చదవండి: ఇసుకలో సిమెంట్‌ కూడా కలపాలి మహాప్రభో!.. బీహార్‌లో కూలిన రెండో వంతెన!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement