సాక్షి, అనంతపురం: ఏపీలో ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీలపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్-6 హామీల అమలు బాధత్య చంద్రబాబుదే అని చెప్పుకొచ్చారు.
కాగా, సీపీఐ రామకృష్ణ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు బాధ్యత చంద్రబాబుదే. ఇప్పుడు సూపర్ సిక్స్ అంటే భయమేస్తుందని అనడం కరెక్టేనా?. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే చంద్రబాబు హామీలు ప్రకటించారు. ఏపీలో సంపద సృష్టించి హామీలు నెరవేరుస్తానని, అమలు చేస్తానని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు అప్పులపై గందరగోళం సృష్టిస్తున్నారు. కేంద్రం ఒకటి చెబితే రాష్ట్రంలో మరొకటి చెబుతున్నారు. అమరావతికి రూ.15వేల కోట్ల అప్పు కాదు. గ్రాంట్ తేవాలి. ఏపీ అప్పులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. ఏపీకి ప్యాకేజీ కాదు. ప్రత్యేక హోదా కావాలి అని డిమాండ్ చేశారు.
ఇక, అంతకుముందు చంద్రబాబుపై రామకృష్ణ సీరియస్ అయ్యారు. నీతిఆయోగ్‌లో చంద్రబాబు ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని ఎందుకు అంతగా చంద్రబాబు పొగిడారని ప్రశ్నించారు. మోదీ హయాంలో ఫలానా సమస్య పరిష్కారమైందని చంద్రబాబు చెప్పగలరా?. నరేంద్రమోదీ పదేళ్ల పాలనలో అవినీతి ఏమైనా తగ్గిందా?. బ్యాంకులను ముంచేసి విదేశాలకు పారిపోయిన వారి నుంచి ఏమైనా రికవరీ చేశారా?. మోదీ పదేళ్ల పాలనలో రైతులు అప్పుల పాలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment