
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గంటా మురళీ రామకృష్ణ, దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా కొఠారు అబ్బయ్య చౌదరి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నేతలను ఈ పదవుల్లో నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.