విజయవాడ: కాల్మనీ వ్యవహారంలో విచారణ జరుపుతున్న పోలీసులపై అధికార పార్టీ ఒత్తిడి ఉందని ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఆర్థిక అరాచకాలకు విజయవాడ అడ్డాగా మారిందన్న ఆయన.. కాల్మనీ వ్యవహారంలో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో మహిళలకు న్యాయం జరగకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తామని రామకృష్ణ హెచ్చరించారు.
'ఆర్థిక అరాచకాలకు విజయవాడ అడ్డాగా మారింది'
Published Sun, Dec 13 2015 5:54 PM | Last Updated on Sun, Sep 3 2017 1:57 PM
Advertisement
Advertisement