‘కరువును ఎదుర్కోవడంలో చంద్రబాబు విఫలమయ్యారు’ | CPI Leader Ramakrishna Comments On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 30 2018 12:54 PM | Last Updated on Sun, Sep 30 2018 12:57 PM

CPI Leader Ramakrishna Comments On Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో కరువును ఎదుర్కోవడంలో చంద్రబాబు విఫలమయ్యారని, కర్నూల్‌ జిల్లాలో రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలనే కాదు.. అంతర్జాతీయ సభల్లో కూడా మోసపూరితమైన మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వ్యవసాయ దండగా అని చెప్పిన విషయం మర్చిపోయినట్టున్నారని అన్నారు. హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమైందని ఎద్దేవాచేశారు. కరువు సమస్యపై వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని ప్రకటించారు. నిరుద్యోగ భృతి కనీసం ఐదు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement