సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల కాంటూర్ వరకూ మిగిలిన పనుల పూర్తికి గతేడాది జూన్ 5నే నిధులు మంజూరు చేసిన కేంద్రం.. ఇప్పుడు ఆ నిధుల విడుదలకు కసరత్తు చేస్తోంది.
రెండేళ్ల గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులకు రూ.2,800 కోట్లు ఇవ్వాలని కోరుతూ జల్ శక్తి శాఖ వారం కిందట కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. వాటిని కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఖాతాలో జమ చేయనుంది.
41.15 మీటర్ల వరకు ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లుగా ఖరారు చేసిన కేంద్ర కేబినెట్.. ఇప్పటిదాకా విడుదల చేసిన నిధులుపోనూ మిగతా రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు ఇటీవల ఆమోదం తెలిపింది. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులకు రూ.2,800 కోట్లు ఇవ్వాలని కోరుతూ జల్ శక్తి శాఖ ప్రతిపాదనలు పంపింది.
Comments
Please login to add a commentAdd a comment