సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో తెలంగాణపై పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ టీంతో నివేదిక తయారు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. శనివారం.. సీఎంతో నీటిపారుదల శాఖ అధికారులు భేటీ కాగా, నెల రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని తెలిపారు. పోలవరం నిర్మాణంతో భద్రాచలం ఆలయానికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలంటూ సీఎం రేవంత్ ఆదేశించారు.
2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైనట్లు సీఎంకి అధికారులు వివరించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్‌ను సీఎం రేవంత్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఆ ప్రాజెక్టుకు అనుమతులు లేవని తెలిపారు.
వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్‌పైన ఇటీవల ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు. తమ అభ్యంతరాలను ఏపీ సీఎస్‌కు తెలియజేయాలన్న రేవంత్.. అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుతో పాటు కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖలు రాయాలంటూ ఆదేశించారు.
ఇదీ చదవండి: చిట్టినాయుడు కేసులకు భయపడం: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment