సుజలాంధ్ర.. సుఫలాంధ్ర.. | Six irrigation projects completed in three years: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సుజలాంధ్ర.. సుఫలాంధ్ర..

Published Tue, Apr 30 2024 2:53 AM | Last Updated on Tue, Apr 30 2024 2:53 AM

Six irrigation projects completed in three years: Andhra Pradesh

మూడేళ్లలోనే ఆరు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి  

6 రిజర్వాయర్లలో గరిష్టస్థాయిలో నీటి నిల్వ  

ఏటా కోటి ఎకరాలకు సాగునీరిస్తున్న  సీఎం వైఎస్‌ జగన్‌     

ప్రణాళికాబద్ధంగా సాగునీటి ప్రాజెక్టుల పూర్తి 

పెన్నా డెల్టా జీవనాడులు సంగం, నెల్లూరు బ్యారేజ్‌ల పూర్తి 

లక్కవరం ఎత్తిపోతలతో కర్నూలు, నంద్యాల జిల్లాలు సస్యశ్యామలం 

అవుకు రెండో టన్నెల్‌ పూర్తి  

గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులు   

కుప్పానికి కృష్ణా జలాల తరలింపు 

వెలిగొండ జంట సొరంగాల పూర్తి 

పోలవరం ప్రాజెక్టు పూర్తి దిశగా అడుగులు 

లక్ష్యాన్ని సాధించలేని వారే సాకులు వెతుక్కుంటారు. కార్యసాధకులకు సాకులు అడ్డురావు. అవకాశాలను అన్వేషించి మరీ లక్ష్యాలను సాధిస్తారు. ఇందులో మొదటి తరహా వ్యక్తి చంద్రబాబు అయితే రెండో తరహా నేత సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. పద్నాలుగేళ్లు సీఎంగా పని చేశానని గొప్పలు చెప్పుకుంటూ.. తన కుప్పం నియోజకవర్గానికే నీటిని తెచ్చుకోలేని దౌర్భాగ్యం చంద్రబాబుది. ఐదేళ్ల పాలనలో మూడేళ్లలోనే ఆరుప్రాజెక్టులు పూర్తి చేసి, మరో ఆరు ప్రాజెక్టులను దాదాపుగా పూర్తి చేసిన జల రుషి సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.

 చంద్రబాబు పాలనంతా కరవు మయం. ఏటా కరవు మండలాల ప్రకటన. ప్రభుత్వ సాయం అందక రైతుల హాహాకారాలు. 2019లో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా విపత్తు రెండేళ్ల పాటు కర్కశంగా ఆర్థిక స్థితిని కుదేలు చేసినప్పటికీ, జగన్‌ ప్రభుత్వం సాకులు వెతుక్కోలేదు. జన సంక్షేమమేపరమావధి అనుకున్నారు. మూడేళ్ల వ్యవధిలోనే ప్రాజెక్టుల్లో నీటి ఉరవడిని మడుల్లోకి మళ్లించిన ఖ్యాతి జగన్‌కు మాత్రమే దక్కుతుంది. - ఆలమూరు రాంగోపాల్‌రెడ్డి, సాక్షి, అమరావతి:

సాక్షి, అమరావతి:  రాష్ట్ర సాగునీటిరంగంలో నవచరిత్రను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లిఖించారు. కరోనా మహమ్మారి ప్రభావం.. లాక్‌ డౌన్‌ల దెబ్బతో దాదాపు రెండేళ్లపాటు దేశంలో ఎక్కడా ప్రాజెక్టుల పనులు చేయలేని పరిస్థితి. ప్రపంచంలో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కరోనా మహమ్మారి దెబ్బతీసింది. ఆర్థిక ఇబ్బందుల్లోనూ సాగునీటి ప్రాజెక్టుల పనులను సీఎం వైఎస్‌ జగన్‌ పరుగులెత్తించారు. కేవలం మూడేళ్లలోనే ఆరు ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. 

మరో ఆరు ప్రాజెక్టులను దాదాపుగా పూర్తి చేశారు.  దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడం ద్వారా.. బ్రహ్మంసాగర్‌ మట్టికట్టలకు డయాఫ్రమ్‌ వాల్‌ వేసి లీకేజీలకు అడ్డుకట్ట వేయడం ద్వారా మొత్తం 6 రిజర్వాయర్లలో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేశారు. యాజమాన్య పద్ధతుల ద్వారా ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి ఏటా కోటి ఎకరాలకు  నీళ్లందించడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు. 

చరిత్రలో మహోజ్వల ఘట్టం  
వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. సాగునీటి ప్రాజెక్టులను ప్రణాళికాయుతంగా చేపట్టి, పూర్తి చేస్తున్నారు. 2019, మే 30 నుంచి ఇప్పటి వరకూ పోలవరంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల పనులకు రూ.35,268.05 కోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టులపై పెట్టిన ప్రతి పైసాను సది్వనియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని.. రైతులకు అందించారు.   

పెన్నా డెల్టా సుభిక్షం 
జల యజ్ఞంలో భాగంగా మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన పెన్నా డెల్టాకు జీవనాడులైన సంగం, నెల్లూరు బ్యారేజ్‌లలో మిగిలిన పనులను సీఎం వైఎస్‌ జగన్‌  రూ.216.88 కోట్లు వెచ్చిచి పూర్తి చేసి.. 2022, సెపె్టంబరు 6న జాతికి అంకితం చేశారు. తండ్రి ప్రారంభించిన బ్యారేజ్‌ల పనులను తనయుడు పూర్తి చేసి, జాతికి అంకితం చేయడాన్ని సాగునీటిరంగ చరిత్రలో మహోజ్వలఘట్టంగా అధికారవర్గాలు అభివరి్ణస్తున్నాయి.  పెన్నా డెల్టాలో 4.83 లక్షల ఎకరాలకు సమర్థంగా నీళ్లందించడమే కాకుండా ఆ రెండు బ్యారేజ్‌ కమ్‌ బ్రిడ్జిల ద్వారా రవాణా సౌకర్యాలను మెరుగుపర్చారు. పెన్నా నదీ పరివాహక ప్రాంత ప్రజలను వరద ముప్పు నుంచి తప్పించారు. నెల్లూరు నగరంతోపాటు పెన్నా డెల్టా ప్రజల తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు.  

జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీటి నిల్వ 
గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, సోమశిల, కండలేరులలో నిర్వాసితులకు పునరావాసం  కల్పించకపోవడం వల్ల వాటిలోనూ పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేని దుస్థితి. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక గండికోట నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్వాసితులకు రూ.250 కోట్లతో పునరావాసం కల్పించారు. ఆ తర్వాత గండికోటలో 26.85 టీఎంసీలు, చిత్రావతిలో పది టీఎంసీలు నిల్వ చేస్తున్నారు.

తెలుగుగంగ ప్రధాన కాలువ, లింక్‌ కెనాల్‌కు రూ.580 కోట్లతో లైనింగ్‌ చేయడం ద్వారా సకాలంలో వెలిగోడు, బ్రహ్మంసాగర్‌ను నింపడానికి సీఎం వైఎస్‌ జగన్‌ మార్గం సుగమం చేశారు. బ్రహ్మంసాగర్‌ మట్టికట్టకు లీకేజీల వల్ల 2019 వరకూ కేవలం నాలుగైదు టీఎంసీల నీటినైనా నిల్వ చేయలేని దుస్థితి. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక బ్రహ్మంసాగర్‌ మట్టికట్టకు డయాఫ్రమ్‌వాల్‌ నిర్మించి.. లీకేజీలకు అడ్డుకట్ట వేసి.. పూర్తి స్థాయిలో అంటే 17.74 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు.  

దశాబ్దాల కల సాకారం 
ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల కల వెలిగొండ. ఆ ప్రాజెక్టును 2005లో మహానేత వైఎస్‌ చేపట్టి పనులు పరుగులు పెట్టించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్‌ అవినీతికి పాల్పడటంతో వెలిగొండ పనులు పడకేశాయి.  జగన్‌ అధికారంలోకి వచ్చాక వెలిగొండ ప్రాజెక్టులో మొదటి సొరంగంలో మిగిలిన 2.833 కి.మీ. పనులను 2021, జనవరి 13 నాటికే పూర్తి చేశారు.

రెండో సొరంగంలో మిగిలిన 7.698 కి.మీ. పనులను పూర్తి చేసి.. రెండు సొరంగాలను మార్చి 6న జాతికి అంకితం చేశారు. ఇప్పటికే ఫీడర్‌ చానల్, నల్లమలసాగర్‌ పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చిన వెంటనే సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని తరలించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు. వెలిగొండతో ప్రకాశం జిల్లా రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి. 

బాబు  జమానా అవినీతి ఖజానా  
కడలిపాలవుతోన్న నదీ జలాలను బంజరు భూములకు మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకే సారి రూ.లక్ష కోట్ల వ్యయంతో 84 ప్రాజెక్టులను చేపట్టారు. అప్పట్లోనే 23 ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. మిగతా 40 ప్రాజెక్టుల్లో(పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి) మిగిలిన పనులను కేవలం రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తానని 2014, జూలై 28న విడుదల చేసిన శ్వేతపత్రంలో అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. 

జూన్‌ 8, 2014 నుంచి మే 29, 2019 వరకూ సాగునీటి ప్రాజెక్టులకు రూ.68,293.94 కోట్లను ఖర్చు చేశారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పట్టిసీమ, పురుషోత్తపట్నం మినహా మిగతా 40 జలయజ్ఞం ప్రాజెక్టులకు రూ.41,833.12 కోట్లు ఖర్చు చేశారు. శ్వేతపత్రంలో చెప్పిన దానికంటే రూ.24,465.12 కోట్లు అధికంగా ఖర్చు చేసినా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. దీన్ని బట్టి చూస్తే.. సాగునీటి ప్రాజెక్టుల్లో చంద్రబాబు ఏ స్థాయిలో దోపిడీ చేశారన్నది అర్థం చేసుకోవచ్చు. 

నీటిపారుదల రంగ చరిత్రలో రికార్డు  
కృష్ణా డెల్టా వరదాయిని పులిచింతల ప్రాజెక్టును మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి నిర్మించారు. గత ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల 2019 వరకూ పూర్తి నీటి నిల్వ 45.77 టీఎంసీలను నిల్వ చేయలేని దుస్థితి. జగన్‌ అధికారంలోకి వచ్చాక కొద్ది రోజుల్లోనే నిర్వాసితులకు పునరావాసం కల్పించి 2019 ఆగస్టులోనే పులిచింతలలో 45.77 టీఎంసీలను నిల్వ చేసి.. కృష్ణా  డెల్టాలో రెండో పంటకూ నీళ్లందించడానికి మార్గం సుగమం చేశారు. 

కోటి ఎకరాలకు జలధారలు  
విభజన తర్వాత 2014 నుంచి 2019 మధ్య ఐదేళ్లూ దుర్భిక్షంతో రాష్ట్ర రైతులు, ప్రజలు తల్లడిల్లిపోయారు. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి, ఏలేరు తదితర నదులలో నీటి లభ్యత పెరిగింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ప్రతి ఏటా ఖరీఫ్, రబీలలో కలిపి ఏటా కోటి ఎకరాలకు జగన్‌ నీళ్లందించారు. ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించడంతో భారీ ఎత్తున రైతులు పంటలు సాగుచేశారు.

రికార్డు స్థాయిలో ధాన్యపు దిగుబడులు సాధించి రాష్ట్రాన్ని మళ్లీ దేశ ధాన్యాగారం (రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా)గా సీఎం వైఎస్‌ జగన్‌ నిలిపారు. వాతావరణ మార్పుల వల్ల కృష్ణా నదికి వరద రోజులు తగ్గిన నేపథ్యంలో.. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే రోజుల్లో దానిపై ఆధారపడ్డ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రాజెక్టులను నింపేలా కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులను సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టారు. ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయి.  

శరవేగంగా పోలవరం 
రాష్ట్ర ప్రజల దశాబ్దాల స్వప్నం పోలవరాన్ని మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సాకారం చేస్తూ జలయజ్ఞంలో భాగంగా చేపట్టి.. ప్రాజెక్టు పనులను పరుగులెత్తించారు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో పోలవరంలో విధ్వంసం సృష్టించారు.  వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక.. అప్రోచ్‌ చానల్, స్పిల్‌ వే, స్పిల్‌ చానల్, పైలట్‌ చానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేసి 2021, జూన్‌ 11నే గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా 6.1 కి.మీ. పొడవునా మళ్లించారు. 

చంద్రబాబు అవినీతితో ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చి యథాస్థితికి తెచ్చే పనులను వేగవంతం చేశారు. దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌పై కేంద్ర జలసంఘం స్పష్టత ఇచ్చాక.. ఆ పనులు పూర్తి చేసి.. ఆ తర్వాత ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసి.. ఆయకట్టుకు నీళ్లందించి.. జాతికి అంకితం చేయనున్నారు.

గండికోటలోకి బిరబిరా కృష్ణమ్మ 
గాలేరు–నగరిలో అంతర్భాగంగా అవుకు వద్ద రెండు సొరంగాలను చేపట్టారు. ఇందులో ఒక సొరంగం దివంగత సీఎం వైఎస్‌ హయాంలోనే పూర్తయింది. రెండో సొరంగాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి చేశారు. రెండు సొరంగాలను రూ.567.94 కోట్లతో పూర్తి చేసి.. నవంబర్‌ 30, 2023న సీఎం వైఎస్‌ జగన్‌ జాతికి అంకితం చేశారు. ప్రస్తుత డిజైన్‌ మేరకు గాలేరు–నగరి కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను విడుదల చేశారు. శ్రీశైలానికి కనిష్టంగా వరద వచ్చే రోజుల్లోనే గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు అవుకు వద్ద మూడో సొరంగం  పనులను చేపట్టారు. 

ఈ పనులకు ఇప్పటికే రూ.934 కోట్లు ఖర్చు చేశారు. మూడో సొరంగమూ దాదాపు పూర్తయింది. దాంతో శ్రీశైలానికి కనిష్టంగా వరద వచ్చే రోజుల్లోనే వరద కాలువ ద్వారా 30 వేల క్యూసెక్కులు తరలించి.. గండికోట, పైడిపాలెం, వామికొండ, సర్వారాయసాగర్, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లను నింపడానికి మార్గం సుగమం చేశారు. తద్వారా 2.60 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరందించనున్నారు. తద్వారా 1.31 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు 20 లక్షల మందికి తాగునీరందించనున్నారు.  

కుప్పానికి కృష్ణా జలాలు..: హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలోని పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌లో అంతర్భాగంగా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులను రూ.560.29 కోట్లతో సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి చేసి, ఫిబ్రవరి 26న జాతికి అంకితం చేశారు. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులు నింపి, 6,300 ఎకరాలకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరందించనున్నారు. కుప్పం నియోజకవర్గానికి 1989 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు అవినీతికి పాల్పడటం వల్ల కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను పూర్తి చేయలేక చేతులెత్తేస్తే..  జగన్‌ పూర్తి చేయడం అబ్బురం...అపూర్వం.

వలసలకు అడ్డుకట్ట  
హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి లక్కవరం ఎత్తిపోతల ద్వారా నీటిని ఎత్తిపోసి కర్నూలు, నంద్యాల  జిల్లాల్లో పశ్చిమ మండలాల్లో 77 చెరువులను నింపడం ద్వారా పది వేల ఎకరాలను సస్యశ్యామలం చేసే లక్కవరం ఎత్తిపోతల పథకాన్ని రూ.224.31 కోట్లు వెచ్చిచి సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి చేసి సెప్టెంబరు 18, 2023న జాతికి అంకితం చేశారు. సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించడం ద్వారా నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని పశ్చిమ మండలాల్లో వలసలకు అడ్డుకట్ట వేశారు. 

కోనసీమలా రెండు పంటలు 
బ్రహ్మంసాగర్‌ మట్టికట్టకు లీకేజీల వల్ల గతంలో ఎన్నడూ మూడు నాలుగు టీఎంసీలు కూడా నిల్వ చేసిన దాఖాలాలు లేవు. తెలుగుగంగ ఆయకట్టుకు సాగునీటి మాట దేవుడెరుగు కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరికేవి కావు. బ్రహ్మంసాగర్‌ ఉన్నా ఏం ప్రయోజనం లేదని బాధపడేవాళ్లం. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక బ్రహ్మంసాగర్‌ లీకేజీలకు డయాఫ్రమ్‌ వాల్‌ వేసి అడ్డుకట్ట వేసి..  పూర్తి సామర్థ్యం మేరకు 17.85 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. దాంతో కోనసీమ తరహాలో ఆయకట్టులో రెండు పంటలకు సమృద్ధిగా నీళ్లందుతున్నాయి. తెలుగుగంగ ప్రాజెక్టు ఫలాలు నిజంగా రైతులకు అందుతున్నది ఇప్పుడే. – పోచంరెడ్డి రఘురాంరెడ్డి, సోమిరెడ్డిపల్లి, బ్రహ్మంగారిమఠం మండలం, వైఎస్సార్‌ జిల్లా. 

సంగం బ్యారేజ్‌తో కష్టాలు తీరాయి 
బ్రిటీష్‌ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సంగం ఆనకట్ట శిథిలమవడంతో ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందేవి కావు. పెన్నా డెల్టాను సస్యశ్యామలం చేసేందుకు 2004లో మహానేత వైఎస్‌ నాడు సంగం బ్యారేజ్‌ పనులు చేపట్టారు. 2009 వరకూ పనులు శరవేగంగా సాగాయి. మహానేత వైఎస్‌ మరణించాక బ్యారేజ్‌ పనులు పడకేశాయి. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక పనులు పూర్తి చేసి సమృద్ధిగా నీళ్లందిస్తున్నారు. దాంతో నాకున్న 13 ఎకరాలతోపాటు 40 ఎకరాలను కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాను. – మల్లవరం రామకృష్ణ, పడుగుపాడు, కోవూరు మండలం  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement