పోలవరం ప్రాజెక్టు పనుల్లో చారిత్రక తప్పిదం చేసిన చంద్రబాబు
బాబు అస్తవ్యస్త పనులకు ధ్వంసమైన ప్రాజెక్టు
ఆ తప్పులు వైఎస్ జగన్‌పైకి.. ఎల్లో మీడియా వంత పాట
జగన్ సర్కారు కాంట్రాక్టర్‌ను మార్చడం వల్లేనంటూ అభూతకల్పనలు
2005 నుంచి 2019 వరకూ పూర్తయిన పనులు 24.85 శాతమే
2019 నుంచి 2024 వరకు 24.94 శాతం పూర్తి చేసిన జగన్ సర్కారు
ఇప్పటివరకు పూర్తయిన పనులు 49.79 శాతమే
చంద్రబాబు హయాంలోనే 72 శాతం పూర్తైనట్లు కట్టుకథలు
వరదను మళ్లించే స్పిల్ వే కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టించిన బాబు
ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు చేపట్టి, పూర్తి చేయలేక చేతులెత్తేసిన వైనం
2019, 2020లో ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీలగుండా అధిక ఉద్ధృతితో ప్రవహించిన వరద
దానివల్లే పోలవరంలో విధ్వంసం
చంద్రబాబు సర్కార్ తప్పిదమేనని తేలి్చచెప్పిన ఐఐటీ నిపుణులు, కేంద్ర మంత్రి
ఆ తప్పులను చక్కదిద్దుతూ పనులను ప్రణాళికాబద్ధంగా శరవేగంతో చేపట్టిన జగన్ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: స్వలాభం కోసం కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును తాను తీసుకొని, కాసుల కోసం అస్తవ్యస్తంగా నిర్మాణాన్ని చేపట్టి, మొత్తం ప్రాజెక్టునే ధ్వంసం చేసింది సీఎం చంద్రబాబే. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా, ఆ తప్పులను హుందాగా ఒప్పుకొని, సరిదిద్దుకొనే నైజం లేని ఆయన.. వాటిని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై నెట్టేస్తున్నారు.
కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆదేశాలను బేఖాతరు చేస్తూ పోలవరంలో తాను అడ్డగోలుగా చేసిన పనుల వల్ల జరిగిన విధ్వంసం.. పర్యవసానంగా పనుల్లో జాప్యం, జరిగిన రూ.వేల కోట్ల నష్టాన్ని వైఎస్ జగన్‌పైకి నెట్టేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న దుస్సాహసానికి ఎల్లో మీడియా యధావిధిగా వంతపాడుతోంది. అభూత కల్పనలతో కథనాలు ప్రచురిస్తోంది. సోమవారమూ ఇలాంటి కథనాలు ప్రచురించింది.
విభజన చట్టం ప్రకారం కేంద్రమే కట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను కమీషన్లకు ఆశపడి 2016 సెపె్టంబరు 7న అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకొని అర్ధరాత్రి చారిత్రక తప్పిదం చేశారు. ఆ పనులనూ ప్రణాళికాబద్ధంగా చేపట్టకుండా, స్వలాభం కోసం అస్తవ్యస్తంగా చేపట్టారు. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించే స్పివ్ వేను పూర్తి చేయకుండా, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ గ్యాప్–2లో పునాది డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించి మరో చారిత్రక తప్పిదం చేశారు.
ఇది చాలదన్నట్టు.. 2019 ఎన్నికలకు ముందు హడావుడిగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టారు. వాటినీ పూర్తి చేయలేక 2019 ఫిబ్రవరిలో మధ్యలోనే పనులు ఆపేసి చేతులెత్తేశారు. పోలవరం వద్ద 2,400 మీటర్ల వెడల్పుతో ప్రవహించే గోదావరికి ఎగువ కాఫర్ డ్యామ్ అడ్డంకిగా మారింది. దానికి ఇరువైపులా ఉన్న ఖాళీ ప్రదేశం 800 మీటర్లకు కుచించుకుపోయింది. 2019, 2020లలో వచి్చన వరదలకు ఈ ప్రదేశంలో ఉధృతి మరింత పెరిగిపోయింది. ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో నీరు ప్రవహించడంతో గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది.
ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై గరిష్ఠంగా 36 మీటర్ల నుంచి కనిష్టంగా 26 మీటర్ల లోతుతో నాలుగు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఈ భారీ నష్టానికి చంద్రబాబు సర్కారు చేసిన చారిత్రక తప్పిదమే కారణమని నీతి అయోగ్ నియమించిన ఐఐటీ(హైదరాబాద్) నిపుణుల కమిటీ తేలి్చచెప్పింది. లోక్‌సభ, రాజ్యసభలో టీడీపీ సభ్యులు అనేక సార్లు అడిగిన ప్రశ్నలకు అప్పటి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కూడా చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదం వల్లే పోలవరంలో విధ్వంసం జరిగిందని స్పష్టంగా చెప్పారు. అయినా ఆ తప్పిదాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్‌పై నెట్టేందుకు చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రయత్నం చేస్తున్నాయి.
అక్రమాల గుట్టు రట్టవడంతోనే..
పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌లో రూ.2,917 కోట్ల విలువైన పనులను ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్ నుంచి తప్పించి మరో కాంట్రాక్టర్‌కు అప్పగించడానికి 2018లో అప్పటి సీఎం చంద్రబాబు ప్రయతి్నంచారు. కాంట్రాక్టర్‌ను మార్చితే సమస్యలు వస్తాయని, వాటికి బాధ్యత ఎవరు వహిస్తారంటూ సీడబ్ల్యూసీ, పీపీఏ అభ్యంతరం తెలిపినా చంద్రబాబు లెక్క చేయలేదు. పాత ధరలకే అంటే 2010–11 ధరల ప్రకారం పనులు చేయడానికి నవయుగ ముందుకొచ్చిందని చెబుతూ.. 2015–16 ధరల ప్రకారం మొత్తం రూ.2,917 కోట్ల పనులను కేవలం నామినేషన్ పద్ధతిలో అప్పగించారు.
ఇంత భారీ విలువైన పనులను కేవలం నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టిన దాఖలాలు దేశ చరిత్రలోనే లేవంటూ అప్పట్లో అధికారవర్గాలు నివ్వెరపోయాయి. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు సర్వత్రా వచ్చాయి. పోలవరంను కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీనే అప్పట్లో వ్యాఖ్యానించడం గమనార్హం. వైఎస్ జగన్ ప్రభుత్వం వచి్చన తర్వాత చంద్రబాబు అక్రమ పద్ధతిలో నవయుగకు కట్టబెట్టిన హెడ్ వర్క్స్, జల విద్యుత్ కేంద్రం పనులను రద్దు చేసింది.
2019లో రివర్స్ టెండరింగ్ నిర్వహించింది. ఈ టెండర్లలో నవయుగకు అప్పగించిన పనుల వ్యయంకంటే.. రూ.783.44 కోట్లకు తక్కువకే పనులు చేయడానికి మేఘా సంస్థ ముందుకొచి్చంది. దాంతో చంద్రబాబు సర్కారు అక్రమాలు రట్టయ్యాయి. దీన్ని కప్పిపుచ్చుకోవడానికే సీడబ్ల్యూసీ, పీపీఏ అభ్యంతరం చెప్పినా నవయుగను మార్చి మేఘాకు పనులు అప్పగించడం వల్లే పోలవరంలో విధ్వంసం జరిగిందని చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రచారం ప్రారంభించారు.
రివర్స్ టెండర్లతోనే శరవేగంగా పనులు
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పటి నుంచి 2019 వరకూ పూర్తయిన పనులు 24.85 శాతం. వైఎస్ జగన్ సర్కారు రివర్స్ టెండరింగ్‌తో పనులు మేఘాకు అప్పగించారు. చంద్రబాబు చేసి తప్పులను సరిదిద్దుతూ ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టు పనులను శరవేగంగా చేపట్టారు. 2019 నవంబర్‌లో పనులు ప్రారంభించిన మేఘా.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ రికార్డు సమయంలో స్పిల్ వేను 48 గేట్లతో సహా పూర్తి చేసింది. సిల్ప్ ఛానల్, అప్రోప్ ఛానల్, పైలట్ చానల్‌లను పూర్తి చేసింది.
ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసింది. 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా 6.1 కిలోమీటర్ల పొడవున మళ్లించి వైఎస్ జగన్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. పోలవరం ప్రాజెక్టు భద్రత కోసం సీడబ్ల్యూసీ, పీపీఏ మంజూరు చేసిన రూ.689.47 కోట్ల పనులు ఒకసారి, రూ.1,615.75 కోట్ల పనులను రెండోసారి వరుసగా 1.98 శాతం, 1.02 శాతం తక్కువ ధరకు మేఘాకు అప్పగించింది. చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్ల ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను 1.0584 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకతో పూడ్చి, వైబ్రో కాంపాక్షన్ చేసి యధాస్థితికి తెచ్చింది.
డ్యామ్ గ్యాప్–3లో కాంక్రీట్ డ్యామ్, గ్యాప్–1లో డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసింది. జలవిద్యుత్ కేంద్రంలో సొరంగాలు, పవర్ స్టేషన్ పనులను కొలిక్కి తెచి్చంది. జలాశయాన్ని కుడి, ఎడమ కాలువలతో అనుసంధానం చేసే హెడ్ రెగ్యులేటర్లు, సొరంగాల నిర్మాణం పూర్తి చేసింది. 2019 మే 30 నుంచి 2024 జూన్ 11 వరకూ 24.94 శాతం పనులు పూర్తి చేశారు. అంటే 2005 నుంచి ఇప్పటిదాకా పూర్తయిన ప్రాజెక్టు పనులు 49.79 శాతమే. అంటే సగమే. కానీ.. చంద్రబాబు హయాంలోనే పోలవరం పనులు 72 శాతం పూర్తయినట్లు ఎల్లో మీడియా కట్టుకథలు అల్లడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment