
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచన మేరకు పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డిజైన్లు, నిర్మాణ పనులపై చర్చించడానికి 20న ప్రాజెక్టు వద్ద కేంద్ర జలసంఘం వర్క్ షాపు నిర్వహించనుంది.
ప్రధాన డ్యాం గ్యాప్–2 పునాది డయాఫ్రం వాల్, ఎగువ కాఫర్ డ్యాంలో సీపేజీకి అడ్డుకట్ట వేయడంతోసహా కీలకమైన డిజైన్లు, పనులు చేపట్టడంపై ఈ వర్క్ షాప్‌లో చర్చించనున్నారు. అంతర్జాతీయ నిపుణులతోపాటు రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు. డిజైన్లతోపాటు ఈ సీజన్ అంటే నవంబర్ నుంచి 2025, జూలై వరకూ చేపట్టాల్సిన పనులు.. వాటిని పూర్తి చేయాల్సిన షెడ్యూలును ఖరారు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment