
అమలు కాని హామీల వివరాలివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల్లో ఇంకా అమలు కాని వాటికి సంబంధించిన వివరాలను పంపాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావును కోరారు. అవసరమైతే మంత్రుల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి హామీలను అమలు చేస్తామని చెప్పారు. గురువారమిక్కడ అరుణ్ జైట్లీతో సమావేశమైన కేటీఆర్.. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలుపై చర్చించారు. దీనిపై జైట్లీ స్పందిస్తూ.. ఇప్పటికి వరకు అమలు కాని హామీల వివరాలివ్వాలని కోరారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ప్రకటించిన నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యాన్ని కూడా కేటీఆర్ ఈ సందర్భంగా వివరించారు. ఈ నిధులను త్వరలోనే విడుదల చేస్తామని జైట్లీ హామీ ఇచ్చారు.
12 చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేయండి
కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఏర్పాటు చేసిన రాష్ట్రాల చేనేత మంత్రుల సమావేశంలో కూడా కేటీఆర్ పాల్గొన్నారు. జాతీయ టెక్స్‌టైల్ పాలసీ ఎలా ఉండాలన్నదానిపై తెలంగాణ తరఫున పలు సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా 1,500 ఎకరాల్లో వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయనుందని వివరించారు. కాటన్ నుంచి ఫ్యాబ్రిక్ దాకా ఒకే చోట తయారు చేసుకొనేందుకు వీలుగా ఈ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. పార్క్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.613 కోట్లతో సమగ్ర ప్రతిపాదనలను కేంద్రానికి పంపినట్టు వివరించారు. ‘‘వరంగల్ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం తరఫున 80 శాతం నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రికి వినతిపత్రాన్ని సమర్పించాం. 2018 ఏప్రిల్ లో ఉత్పత్తి ప్రారంభించడమే లక్ష్యంగా రెండో విడత పార్క్ ఏర్పాటుపై త్వరలోనే నివేదిక పంపుతామని చెప్పాం. పార్క్ ఏర్పాటుకు ఇప్పటికే 1,200 ఎకరాల భూమిని రైతుల ఆమోదంతోనే సేకరించాం. అలాగే రాష్ట్రంలో 12 చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేయాలని స్మృతి ఇరానీని కోరాం. హస్తకళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హస్తకళల అభివృద్ధి కార్పొరేష¯ŒSకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశాం. చేనేత క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇదివర కే పంపిన ప్రతిపాదనలను ఆమోదించాలని కోరాం’’ అని కేటీఆర్ మీడియాకు తెలిపారు.
హ్యాండ్‌లూమ్ టెక్నాలజీ సంస్థను ఏర్పాటు చేయండి...
రాష్ట్ర విద్యార్థులు హ్యండ్‌లూమ్ టెక్నాలజీలో విద్యనభ్యసించడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడడంతో తెలంగాణలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యండ్‌లూమ్ టెక్నాలజీని ఏర్పాటు చేయాలని స్మృతి ఇరానీని కోరినట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణ హస్తకళలను మరింత ప్రోత్సహించడానికి ఢిల్లీలో ‘గోల్కొండ చేనేత కళల ఎంపోరియం’ ఏర్పాటుకు 5 వేల గజాల స్థలాన్ని కేటాయించాలని, అలాగే రాజీవ్ గాంధీ భవన్ను లీజ్‌కు ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు.
మౌలిక సదుపాయాలు
కల్పించండి
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారా మన్తోనూ కేటీఆర్ సమావేశమ య్యారు. సులభతర వాణిజ్య వ్యాపారంలో తెలంగా ణకు మొదటి ర్యాంకు రావడంతో.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలు, సలహాలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలగాణలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపం చవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు ముందుకొ స్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించత లపెట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీ, వైద్య పరికరాల ఉత్పత్తి ప్లాంట్, వరంగల్ టెక్స్‌టై ల్ పార్క్, హైదరాబాద్–నాగ్‌పూర్ ఇండస్ట్రి యల్ కారిడార్, లెదర్ పార్క్, డ్రైపోర్టుల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపా యాలను కల్పించాలని సీతారామన్ను కోరి నట్టు కేటీఆర్ తెలిపారు. సచివాలయం కూల్చివేతపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘కాంగ్రెస్ ను దేశ, రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. సచివాలయం కూల్చివేతపై వారు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. వాటిని పట్టించుకో వాల్సిన అవసరం లేదు’ అని అన్నారు.