
సాక్షి, ఢిల్లీ: సుప్రీం కోర్టులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 27వ తేదీన విచారణ జరగనుంది. తొలుత 24వ తేదీన(రేపు) విచారణ జరుపుతామని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్‌కు తెలిపింది. అయితే..
లిక్కర్ స్కాంలో ఈడీ తీరును తప్పుబడుతూ ఆమె సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పిటిషన్ విచారణ తేదీలో మార్పు చోటుచేసుకుంది. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన బెంచ్ కవిత పిటిషన్‌పై విచారణ జరపనుంది. ఐటెం నెంబర్ 36 గా లిస్ట్ అయ్యింది ఆమె పిటిషన్.
లిక్కర్ స్కాంలో ఈడీ జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని, మహిళలను ఇంటి వద్దే విచారణ చేయాలని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి (అరెస్ట్) చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ వేశారు.
Comments
Please login to add a commentAdd a comment