సాక్షి, ఢిల్లీ: మార్గదర్శి చిట్ ఫండ్ నిధుల మళ్లింపు కేసు విచారణ వాయిదా పడింది. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ కేసులో హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసిన సంగతి విదితమే. అయితే ఈ కేసు విచారణను ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ సిటీ రవికుమార్ , జస్టిస్ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం సోమవారం తెలిపింది.
ఇవాళ్టి వాదనల సందర్భంగా.. చిట్ ఫండ్ పేరుతో నిధులను సేకరించి దారి మళ్ళించారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఏపీ ప్రభుత్వ న్యాయవాది. అలాగే.. ఆంధ్రప్రదేశ్ లోనే నేరం జరిగిందని, కాబట్టి.. కేసులన్నింటినీ ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని వాదించారు. అయితే..
చిట్ ఫండ్ నిధులను హైదరాబాదు నుంచి మ్యూచువల్ ఫండ్ లోకి తరలించారని వాదించారు మార్గదర్శి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి. కాజ్ ఆఫ్ యాక్షన్ హైదరాబాద్ లోనే ఉంది కనుక తెలంగాణలోనే విచారణ జరపాలని వాదించారు. దీంతో.. ట్రాన్స్‌ఫర్ పిటిషన్లతో కలిపి ఈ కేసు విచారణ చేస్తామని పేర్కొన్న ధర్మాసనం, ఆగష్టు 4వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment