సాక్షి, న్యూఢిల్లీ: మార్గదర్శి చిట్ ఫండ్స్ నిధుల దారి మళ్లింపు కేసుపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో సంస్థ యజమానులు, ఉద్యోగులకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న తెలంగాణ హై కోర్డు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ రాజేష్ బిందాల్ విచారణ జరిపారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను పరిశీలన చేస్తామన్న సుప్రీంకోర్టు.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సహా ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేసింది.
‘‘తెలంగాణ హైకోర్డు ఇచ్చిన స్టే పోలీసుల దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తోంది. దర్యాప్తునకు ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దన్నది న్యాయసూత్రం. ఏపీలోనే అత్యధిక చిట్ ఫండ్ డిపాజిట్ దారులు ఉన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ హెడ్ ఆఫీసు హైదరాబాద్‌లో ఉన్న కారణంతో తెలంగాణ హై కోర్టు స్టే ఉత్తర్వులు ఇవ్వడం సరికాదు’’ అని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. బ్రాంచ్ ఆఫీస్ డబ్బు హెడ్ ఆఫీస్‌కు తరలించి స్వాహా చేశారని. సంపూర్ణ న్యాయం కోసం హై కోర్టులో ఏ పిటిషన్ అయినా ట్రాన్స్ ఫర్ చేసే అధికారం 139-ఏ కింద సుప్రీం కోర్టుకు ఉందని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
చదవండి: ఎల్లో మీడియాకు హైకోర్టు దిమ్మదిరిగే గుణపాఠం.. ఆ కుట్రకు గండి పడిందా?
Comments
Please login to add a commentAdd a comment