న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు విచిత్ర పరిస్థితిని ఎదుర్కోనుంది. తనకు సంబంధించిన కేసును తానే విచారించనుంది. పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జి జస్టిస్ షెరావత్ తమపై చేసిన విమర్శలను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం బుధవారం(ఆగస్టు7) విచారించనుంది.
హైకోర్టు జడ్జి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఎలా స్పందించనుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఓ కోర్టు ధిక్కార కేసులో తానిచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే ఇవ్వడంపై పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జి షెరావత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టు తనను కాస్త ఎక్కువ ఊహించుకుంటోందని, అదే సమయంలో హైకోర్టును కాస్త తక్కువ అనుకుంటోందని వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టుకు రాజ్యాంగంలో ప్రత్యేక స్థాయి ఉందని, ఎప్పుడు పడితే ఎలా పడితే అలా ఆదేశాలిచ్చేందుకు వీలు లేదని అన్నారు. పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జి జస్టిస్ షెరావత్ చేసిన ఈ వ్యాఖ్యల అంశాన్ని సుప్రీంకోర్టు మంగళవారమే సుమోటోగా విచారణకు స్వీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment