ఢిల్లీ: జ్ఞాణవాపి మసీదు ప్రాంగణాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ)తో శాస్త్రీయ సర్వే చేయించడానికి వారాణాసి జిల్లా కోర్టు అనుమతినిచ్చింది. ఆగష్టు 4లోగా నివేదికను సమర్పించాలని ఏఎస్‌ఐని ఆదేశించింది. అయితే.. సుప్రీంకోర్టు సీలింగ్ విధించిన వజుఖానా ప్రాంతాన్ని మాత్రం ఇందుకు మినహాయించింది. మసీదును పురాతన హిందూ దేవాలయంపై నిర్మించారా? లేదా? కనుగొనాలని కోర్టును నలుగురు మహిళలు ఆశ్రయించారు. అయితే.. వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసే అవకాశం ఉంది.
కాశీ విశ్వనాథునికి ఎదురుగా ఉన్న జ్ఞాణవాపి మసీదు పురాతన హిందూ దేవాలయం ఆనవాళ్లను కలిగి ఉందని నలుగురు మహిళలు ఈ ఏడాది మే నెలలో కోర్టు మెట్లెక్కారు. మసీదు ప్రాంగణంలో స్వయంభు జ్యోతిర్లింగం ఉండేదని, ముస్లిం పాలకుల దండయాత్రలో ధ్వంసమైందని వారి పిటిషన్‌దారులు పేర్కొన్నారు. అయితే.. మసీదు కమిటీ వీరి వాదనలను ఖండించింది. ఏఎస్‌ఐ సర్వే మసీదు నిర్మాణాలను దెబ్బతీస్తుందని అన్నారు.
గత ఏడాది నిర్వహించిన వీడియోగ్రఫిక్ సర్వేలో కనుగొన్నామని చెబుతున్న శివలింగానికి కార్బన్ డేటింగ్ ప్రక్రియను సుప్రీంకోర్టు నిషేధించింది. అంతేకాకుండా సైంటిఫిక్ సర్వేని విభేదించింది. వజుఖానాని సీలింగ్ చేయాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: మణిపూర్ అంశంపై తెరమీదకు రూల్ నెం.176 Vs 267.. అసలేంటివి?
Comments
Please login to add a commentAdd a comment