
వారణాసి(యూపీ): వారణాసిలోని జ్ఞానవాపి మసీదును గతంలో ఆలయం ఉన్న ప్రదేశంపై నిర్మించారా? అన్న దానిని తేల్చే విషయంలో న్యాయస్థానంలో నలుగుతున్న అంశాన్ని కోర్టు ఆవల రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని విశ్వ వేదిక్ సనాతన్ సంఘ్ పిలుపునిచ్చింది.
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో పురావస్తు శాఖ సర్వే కొనసాగుతున్న ఈ తరుణంలో సనాతన సంఘ్ చీఫ్ జితేంద్ర ఇలా బహిరంగ లేఖ రాయడం గమనార్హం. ఈ లేఖ తమకు అందిందని దీనిపై అంతర్గత సమావేశంలో చర్చిస్తామని ఇంతెజామియా మస్జిద్ కమిటీ సంయుక్త కార్యదర్శి మొహమ్మద్ యాసిన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment