Lok Sabha Election 2024: 14న ప్రధాని మోదీ నామినేషన్‌ | Lok sabha elections 2024: PM Narendra Modi to file nomination from Varanasi on May 14 | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: 14న ప్రధాని మోదీ నామినేషన్‌

Published Sat, May 4 2024 5:30 AM | Last Updated on Sat, May 4 2024 5:30 AM

Lok sabha elections 2024: PM Narendra Modi to file nomination from Varanasi on May 14

వారణాసి: ప్రధానమంత్రి మోదీ ఈ నెల 14న వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న ఆయన ముందు రోజు 13వ తేదీన వారణాసిలో భారీ రోడ్‌ షోలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. 

ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ యూపీ చీఫ్‌ అజయ్‌ రాయ్‌ను పోటీలో ఉంచింది. 2014, 2019 సాధారణ ఎన్నికల్లోనూ మోదీపై పోటీకి దిగిన అజయ్‌ ఓటమి పాలయ్యారు. అదేవిధంగా, రాజస్తాన్‌కు చెందిన కమెడియన్, ప్రధాని మోదీ స్వరాన్ని అనుకరించడంలో సిద్ధహస్తుడు అయిన శ్యామ్‌ రంగీలా కూడా వారణాసి నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement