వారణాసిలో పోటీపై రాహుల్ గాంధీ వ్యాఖ్య
రాయ్‌బరేలీ: ప్రధాని మోదీ పోటీచేసిన వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ పోటీచేస్తే ఆమె రెండు, మూడు లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గేవారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాయ్‌బరేలీలో తనను, అమేథీలో కిశోరీలాల్ శర్మను గెలిపించినందుకు గుర్తుగా మంగళవారం రాయ్‌బరేలీలో ఏర్పాటుచేసిన ‘కృతజ్ఞత కార్యక్రమం’లో అమేథీ, రాయ్‌బరేలీ ఓటర్లనుద్దేశించి రాహుల్ కొద్దిసేపు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో ప్రియాంక, అమేథీ ఎంపీ కిశోరీలాల్ శర్మ పాల్గొన్నారు. ‘‘ పార్లమెంట్‌లో ఎన్‌డీఏ బలాన్ని తగ్గించేందుకే రాయ్‌బరేలీ, అమేథీ సహా దేశవ్యాప్తంగా నియోజకవర్గాల్లో విపక్షాల ‘ఇండియా’ కూటమి పార్టీలు ఉమ్మడి గా పోరాడాయి. ‘‘ బీజేపీ నాయకుల గెలుపు అహంకారాన్ని మేం పట్టించుకోం. మా ఆలోచనంతా ప్రజా సమస్యల గురించే.
అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ, ఇతరత్రా కార్యక్రమాల్లో బడా పారిశ్రామికవేత్తలకు అతి విలువ ఇచ్చి సాధారణ జనాలను మోదీ గాలికొదిలేశారు. వారి సమస్యలను పట్టించుకోలేదు. అందుకే ఏకంగా అయోధ్యలోనూ బీజేపీకి ఓటమి రుచి చూపించి ఓటర్లు బుద్ధి చెప్పారు’’ అని అన్నారు.
అవధ్ గొప్ప సందేశమిచ్చింది: ప్రియాంక
అమేథీ, రాయ్‌బరేలీలో బీజేపీని ఓడించి ఇక్కడి అవధ్ ప్రాంతం ఉత్తరప్రదేశ్‌కేకాదు యావత్‌భారతానికి చక్కటి సందేశం ఇచ్చిదని, మనకు వాస్తవికమైన స్వచ్ఛమైన రాజకీయాల అవసరం ఉందని ప్రియాంకా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment