సాక్షి, హైదరాబాద్: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన మేనల్లుడు జీవన్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని సైదాబాద్ వినయ్‌నగర్‌లో కిషన్‌రెడ్డి అక్క బావ లక్ష్మీ, నర్సింహారెడ్డి నివాసం ఉంటారు. వాళ్ల కుమారుడే జీవన్‌రెడ్డి.
జీవన్‌రెడ్డి గురువారం సాయంత్రం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే కుటుంబసభ్యులు కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఏ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జీవన్‌రెడ్డి మృతిచెందారు. జీవన్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment