Pepperfry Co-founder Ambareesh Murty Dies of Cardiac Arrest - Sakshi
Sakshi News home page

లేహ్‌ అందాలను వీక్షిస్తుండగా..గుండెపోటుతో ఈకామర్స్‌ సంస్థ సీఈవో అంబరీష్‌ మూర్తి హఠాన్మరణం

Published Tue, Aug 8 2023 1:18 PM

Pepperfry Co Founder Ambareesh Murty Dies Of Heart Attack - Sakshi

అప్పటి వరకు నవ్వుతూ, సరదాగా ఉంటున్న వ్యక్తులు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. అందరితో కలివిడిగా ఉన్న వారు అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మారాయి. తాజాగా, ప్రముఖ ఫర్నీచర్‌,హోమ్‌ డెకార్‌ ఈకామర్స్‌ సంస్థ పెప్పర్‌ ఫ్రై కో-ఫౌండర్‌ అంబరీష్‌ మూర్తి గుండె పోటుతో కన్నుమూశారు. 

అంబరీష్‌కు రైడింగ్‌ అంటే మహా ఇష్టం. అందుకే వీలు చిక్కినప్పుడల్లా ఢిల్లీ నుంచి లేహ్‌కు బైక్‌ రైడ్‌ చేస్తుండేవారు. ఈ క్రమంలో ఎప్పటిలాగా లేహ్‌కు వెళ్లిన ఆయన అక్కడ అందరు చూస్తుండగానే  గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. హార్ట్‌ అటాక్‌తో ఆయన కన్నుమూసినట్లు పెప్పర్‌ ఫ్రై మరో కో-ఫౌండర్‌ ఆశిష్‌ ట్వీట్‌ చేశారు.  

 

2012లో అంబరీష్‌ మూర్తి, అశిష్‌తో కలిసి పెప్పర్‌ఫ్రైను స్థాపించారు. 2020 నాటికి ఆ సంస్థ విలువ 500 మిలియన్లుగా ఉంది. అదే ఏడాది 8 రౌండ్లలో 244 మిలియన్ల పెట్టుబడులన్ని సంపాదించింది. ఇన్వెస్ట్‌ చేసిన సంస్థల్లో గోల్డ్‌మన్ సాచ్స్, బెర్టెల్స్‌మాన్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి.

క్రంచ్‌ బేస్‌ నివేదిక ప్రకారం.. ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుండి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ పూర్తి చేశారు. ఐఐటీ కోల్‌కత్తా పూర్వ విద్యార్ధి. గ్రాడ్యుయేషన్‌ సమయం నుంచి ఎంట్రప్రెన్యూషిప్‌లో మెళుకువలు సంపాదించారు. కాలేజీకి వెళ్లే సమయంలో ఇంట్లో ట్యూషన్‌లు చెప్పడం ప్రారంభించారు. అదే సమయంలో పాఠశాల విద్యార్ధులకు టూటర్‌లను అనుసంధానం చేస్తూ ట్యూటర్స్ బ్యూరో అనే సంస్థను ప్రారంభించారు. రెండేళ్ల పాటు ఆ వ్యాపారాన్ని నిర్వహించారు.

ఇదీ చదవండి : ఆనంద్‌ మహీంద్రాకు వేలకోట్లు అలా కలిసొచ్చాయ్‌!

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement