Bike rideing
-
ధోనీ... ఈసారి ఇలా కానియ్!
ఎం.ఎస్. ధోనీ కెప్టెన్షిప్ క్వాలిటీస్ మాత్రమే కాదు సరికొత్త హెయిర్ స్టైల్, సరికొత్త బైక్ కూడా నెటిజనులకు ఆసక్తికరమే. తాజాగా ధోని ‘డూడుల్ వీ3 ’ ఇ–బైక్ రైడింగ్ వీడియో వైరల్ అయింది. రోజుల వ్యవధిలోనే 1.3 మిలియన్ల వ్యూస్‌తో దూసుకు΄ోతుంది. ధోని రైడింగ్ వీడియోలు వైరల్ కావడం కొత్త కానప్పటికీ ఎకో–ఫ్రెండ్లీ మోడ్ ఆఫ్ ట్రాన్స్΄ోర్టేషన్ను ప్రమోట్ చేసే ఈ మేడ్–ఇన్–ఇండియా ఎలక్ట్రికల్ సైకిల్ వీడియో నెటిజనులలో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. -
అందరూ చూస్తుండగానే ..గుండెపోటుతో ఈకామర్స్ సంస్థ సీఈవో హఠాన్మరణం
అప్పటి వరకు నవ్వుతూ, సరదాగా ఉంటున్న వ్యక్తులు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. అందరితో కలివిడిగా ఉన్న వారు అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మారాయి. తాజాగా, ప్రముఖ ఫర్నీచర్,హోమ్ డెకార్ ఈకామర్స్ సంస్థ పెప్పర్ ఫ్రై కో-ఫౌండర్ అంబరీష్ మూర్తి గుండె పోటుతో కన్నుమూశారు. అంబరీష్‌కు రైడింగ్ అంటే మహా ఇష్టం. అందుకే వీలు చిక్కినప్పుడల్లా ఢిల్లీ నుంచి లేహ్‌కు బైక్ రైడ్ చేస్తుండేవారు. ఈ క్రమంలో ఎప్పటిలాగా లేహ్‌కు వెళ్లిన ఆయన అక్కడ అందరు చూస్తుండగానే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. హార్ట్ అటాక్‌తో ఆయన కన్నుమూసినట్లు పెప్పర్ ఫ్రై మరో కో-ఫౌండర్ ఆశిష్ ట్వీట్ చేశారు. Extremely devastated to inform that my friend, mentor, brother, soulmate @AmbareeshMurty is no more. Lost him yesterday night to a cardiac arrest at Leh. Please pray for him and for strength to his family and near ones. 🙏 — Ashish Shah (@TweetShah) August 8, 2023 2012లో అంబరీష్ మూర్తి, అశిష్తో కలిసి పెప్పర్‌ఫ్రైను స్థాపించారు. 2020 నాటికి ఆ సంస్థ విలువ 500 మిలియన్లుగా ఉంది. అదే ఏడాది 8 రౌండ్లలో 244 మిలియన్ల పెట్టుబడులన్ని సంపాదించింది. ఇన్వెస్ట్ చేసిన సంస్థల్లో గోల్డ్‌మన్ సాచ్స్, బెర్టెల్స్‌మాన్ ఇండియా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. క్రంచ్ బేస్ నివేదిక ప్రకారం.. ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుండి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ పూర్తి చేశారు. ఐఐటీ కోల్కత్తా పూర్వ విద్యార్ధి. గ్రాడ్యుయేషన్ సమయం నుంచి ఎంట్రప్రెన్యూషిప్లో మెళుకువలు సంపాదించారు. కాలేజీకి వెళ్లే సమయంలో ఇంట్లో ట్యూషన్లు చెప్పడం ప్రారంభించారు. అదే సమయంలో పాఠశాల విద్యార్ధులకు టూటర్లను అనుసంధానం చేస్తూ ట్యూటర్స్ బ్యూరో అనే సంస్థను ప్రారంభించారు. రెండేళ్ల పాటు ఆ వ్యాపారాన్ని నిర్వహించారు. ఇదీ చదవండి : ఆనంద్ మహీంద్రాకు వేలకోట్లు అలా కలిసొచ్చాయ్! -
బైక్ నడుపుతూ సందడి చేసిన మంత్రి రోజా
-
15 ఏళ్ల తర్వాత బైక్ రైడ్.. ఎన్టీఆర్ హీరోయిన్ వీడియో వైరల్
దర్శకుడు ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘యమదొంగ’తో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన మలయాళ నటి మమతా మోహన్ దాస్. ఆ సినిమాలో ఒక స్పెషల్ గ్లామరస్ పాత్రలో కనిపిస్తూనే ఎన్టీఆర్ కు గట్టి పోటీని ఇచ్చింది. ఆమె నటనను చూసి దర్శకుడు రాజమౌళి అప్పట్లో షూటింగ్ స్పాట్ లోనే షాక్ అయ్యేవారట. కెరీర్ మొదట్లోనే క్యాన్సర్‌ని జయించిన ఈ మలయాళీ బ్యూటీ నటిగానే కాకుండా సింగర్‌గా కూడా ఆకట్టుకుంది. చిరంజీవి ‘శంకర్ దాదా జిందాబాద్’లో ‘ఆకలేస్తే అన్నంపెడతా’, ఎన్టీఆర్ ‘రాఖీ’లో ‘రాఖీ రాఖీ..’ లాంటి సూపర్ హిట్‌పాటలు ఈ బ్యూటీ పాడినవే. చింతకాల రవి, కేడీ చిత్రాల తర్వాత ఆమె టాలీవుడ్‌కి దూరమైంది. మలయాళంలో సినిమాలు చేస్తున్న మమతా టాలీవుడ్‌కి మాత్రం దాదాపు 11 ఏళ్లుగా దూరంగా ఉంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే మమత.. రీసెంట్గా బైక్ రైడ్ చేస్తున్న వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.. బైక్‌ని స్టైలిష్‌గా నడుపుతూ అదరగొట్టేసింది. ఎవరో రైడ్‌కి తీసుకెళ్తారని వెయిట్ చెయ్యడం ఎందుకు? 15 సంవత్సరాల తర్వాత బైక్ డ్రైవ్ చేయడం అమేజింగ్.. కెరీర్ స్టార్టింగ్‌లో సినిమా ప్రయత్నాలు చేసేటప్పుడు మోటార్ సైకిల్ నడిపేదాన్నని పోస్ట్ చేసింది. ప్రస్తుతం మమత . తెలుగు - తమిళ్ - మలయాళంలో తెరకెక్కుతున్న 'లాల్ బాగ్' అనే సినిమాలో నటిస్తోంది. థ్రిల్లర్ కాన్సెప్ట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరల్డ్ వైడ్ గా విస్తరిస్తున్న సాఫ్ట్ వేర్ అంశాన్ని హైలెట్ గా చూపించనున్నారాట. ఇక సమ్మర్ లో ఒకేసారి తెలుగు తమిళ్ మలయాళం భాషల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan) -
మెకానిక్ ధోని...
న్యూఢిల్లీ: క్రికెట్ మ్యాచ్‌ల నుంచి విశ్రాంతి దొరకడంతో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన మొదటి బైక్ పనిపట్టాడు. దాన్ని ఎక్కడికక్కడ స్పేర్ పార్టులుగా విడగొట్టాడు. బైక్ రైడింగ్‌ను అమితంగా ఇష్టపడే ధోని... మొట్టమొదట యమహా రాజ్‌దూత్ బైక్‌ను రూ. 4500కు కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఏమాత్రం తీరిక లభించినా యమహా బైక్‌పై సవారీ చేసి ముచ్చట తీర్చుకునేవాడు. ఇదొక్కటే కాదు అతనివద్ద డజనుకు పైగా పేరొందిన బైకులు, పది ప్రీమియం కార్లు ఉన్నాయి. అయితే ఖాళీగా ఉన్న అతను రాజ్దూత్ను పార్టులుగా విడగొట్టి ట్విట్టర్లో ఫొటోలు పెట్టాడు. రెండు లక్షలకు పైగా ఉన్న తన ఫాలోయర్స్‌తో ఈ అనుభవాన్ని పంచుకున్నాడు. ‘దీన్ని మళ్లీ ఎవరు అసెంబుల్ (ఒక్కటిగా) చేస్తారో తెలీదు కానీ... నేను మాత్రం దీన్నో పట్టు పట్టాను’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. క్రికెట్‌తో పాటు రేసింగ్‌ను అస్వాదించే ధోని... మహి రేసింగ్ టీమ్‌కు యజమాని. ఈ జట్టు ప్రపంచ సూపర్‌బైక్ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటుతోంది. విజయవంతమైన ఈ భారత సారథి త్వరలో సీఎల్టీ20తో బరిలోకి దిగుతున్నాడు. 22న జరిగే మ్యాచ్‌లో టైటాన్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్ తలపడనుంది.