మెకానిక్ ధోని... | mahendra singh dhoni first Bike | Sakshi
Sakshi News home page

మెకానిక్ ధోని...

Published Fri, Sep 13 2013 12:44 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM

మెకానిక్ ధోని...

మెకానిక్ ధోని...

న్యూఢిల్లీ: క్రికెట్ మ్యాచ్‌ల నుంచి విశ్రాంతి దొరకడంతో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన మొదటి బైక్ పనిపట్టాడు. దాన్ని ఎక్కడికక్కడ స్పేర్ పార్టులుగా విడగొట్టాడు. బైక్ రైడింగ్‌ను అమితంగా ఇష్టపడే ధోని... మొట్టమొదట యమహా రాజ్‌దూత్ బైక్‌ను రూ. 4500కు కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఏమాత్రం తీరిక లభించినా యమహా బైక్‌పై సవారీ చేసి ముచ్చట తీర్చుకునేవాడు. ఇదొక్కటే కాదు అతనివద్ద డజనుకు పైగా పేరొందిన బైకులు, పది ప్రీమియం కార్లు ఉన్నాయి. అయితే ఖాళీగా ఉన్న అతను రాజ్‌దూత్‌ను పార్టులుగా విడగొట్టి ట్విట్టర్‌లో ఫొటోలు పెట్టాడు.
 
  రెండు లక్షలకు పైగా ఉన్న తన ఫాలోయర్స్‌తో ఈ అనుభవాన్ని పంచుకున్నాడు. ‘దీన్ని మళ్లీ ఎవరు అసెంబుల్ (ఒక్కటిగా) చేస్తారో తెలీదు కానీ... నేను మాత్రం దీన్నో పట్టు పట్టాను’ అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. క్రికెట్‌తో పాటు రేసింగ్‌ను అస్వాదించే ధోని... మహి రేసింగ్ టీమ్‌కు యజమాని. ఈ జట్టు ప్రపంచ సూపర్‌బైక్ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటుతోంది. విజయవంతమైన ఈ భారత సారథి త్వరలో సీఎల్‌టీ20తో బరిలోకి దిగుతున్నాడు. 22న జరిగే మ్యాచ్‌లో టైటాన్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్ తలపడనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement