
వెండెల్ రోడ్రిక్స్ (ఫైల్ ఫోటో)
పనాజీ : అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత వెండెల్ రోడ్రిక్స్ గోవాలోని కాల్వాలే గ్రామంలోని తన నివాసంలో మరణించారు. రోడ్రిక్స్ బుధవారం రాత్రి తన నివాసంలో కుప్పకూలారని, ఆయన మరణానికి కారణాలు తెలియరాలేదని స్ధానిక డీఎస్పీ గజానన్ ప్రభుదేశాయ్ తెలిపారు. ముంబైలో జన్మించిన రోడ్రిక్స్ (59) 1986 నుంచి 1988 వరకూ అమెరికా, ఫ్రాన్స్‌లో ఫ్యాషన్ డిజైనింగ్‌ను అభ్యసించారు. తొలి లాక్మే ఇండియా ఫ్యాషన్ వీక్ ప్లానింగ్‌లో చురుకుగా పాలుపంచుకున్న రోడ్రిక్స్ పలు ఫ్యాషన్ వీక్స్‌లో తన కలెక్షన్స్‌ను ప్రదర్శించారు.
తన నైపుణ్యాలతో అందరి మన్ననలు పొందిన రోడ్రిక్స్ మరణం కలిచివేసిందని గోవా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే ట్వీట్ చేశారు. కాగా రోడ్రిక్స్ గుండె పోటుతో మరణించారని, ఆయన మరణం ఫ్యాషన్ పరిశ్రమకు తీరని లోటని ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ సునీల్ సేథీ అన్నారు. రోడ్రిక్స్ మృతి తనను దిగ్ర్భాంతికి గురిచేసిందని, భారత్‌లోని ప్రముఖ డిజైనర్లలో ఆయన ఒకరని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు.
చదవండి : గోవా రాకుండా సల్మాన్‌పై నిషేధం!
Comments
Please login to add a commentAdd a comment