
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి పట్టణానికి చెందిన ప్రముఖ సంగీతం మాస్టర్ పిట్టల రామస్వామి శుక్రవారం ఉదయం మూడున్నర గంటలకు గుండెపోటుతో మృతి చెందారు. నిజామాబాద్ – మెదక్ జిల్లాలో భారత జన విజ్ఞాన జాత కేంద్ర ప్రభుత్వ పథకం, ఉమ్మడి జిల్లా అక్షరప్రభ కెప్టెన్‌గా ఆయన వ్యవహరించారు. ప్రభుత్వ పథకాలకు విసృత ప్రచారం కల్పించడంతో పాటు ప్రపంచ రెండో మహాసభలకు మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో రాష్ట్ర కళాకారుల ప్రతినిధిగా హాజరయ్యారు.
ప్రముఖులతో పాటు టీవీ, రెడియోలలో అనేక సంగీత కార్యక్రమాలను పాల్గొన్నారు. మృతునికి భార్య ముగ్గురు కుమారులు , ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంగారెడ్డిలోని బాలికల ఉన్నత పాఠశాలలో సంగీతం మాస్టర్‌గా పని చేసి ఎందరో కళాకారులను తయారు చేశారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలో రామస్వామి అంత్యక్రియల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్, జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు తూర్పు నిర్మల జయప్రకాశ్‌రెడ్డి, పట్టణ టీఆర్‌ఎస్ నాయకులు వెంకటేశ్వర్లు, బొంగుల రవి, నర్సింలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment