హోం వర్క్ చేయలేదని టీచర్ దాడి | teacher attack on student the cause of did not home work | Sakshi
Sakshi News home page

హోం వర్క్ చేయలేదని టీచర్ దాడి

Published Sun, Sep 21 2014 12:05 AM | Last Updated on Fri, Nov 9 2018 4:31 PM

teacher attack on student the cause of did not home work

సంగారెడ్డి మున్సిపాలిటీ : హోం వర్క్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ఉపాధ్యాయురాలు పరీక్షలు రాసే ప్యా డ్‌తో విద్యార్థి తలపై కొట్టడంతో అతను గాయపడ్డాడు. ఈ సంఘటన పట్టణ సమీపంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో శుక్రవారం చోటు చే సుకుంది. వివరాలి లా ఉన్నాయి.. కార్పొరేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి శుక్రవారం పాఠశాలకు హాజరయ్యాడు.

అయితే ఇంగ్లిష్ సబ్జెక్టుకు సంబంధించిన హోం వర్క్ చేయలేదు. ఈ విషయాన్ని ఉపాధ్యాయిని ప్రశ్నిస్తుండగా విద్యార్థి సహచరులతో మాట్లాడుతుండడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేతిలో ఉన్న పరీక్ష ప్యాడ్‌తో తలపై కొట్టింది. ఈ ఘటనతో విద్యార్థి తలకు గాయమై రక్తం వచ్చింది. అయితే గాయానికి ప్రాథమిక చికిత్స కూడా చేయించకుండా సాయంత్రం ఇంటికి పంపింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు బాలుడిని ఆస్పత్రికి వెళ్లి చికిత్సలు చేయించారు. శనివారం బాలుడితో పాటు కుటుంబ సభ్యులు పాఠశాలకు వచ్చి యాజ మాన్యాన్ని నిలదీశారు. దీంతో వారు సదరు టీచర్‌ను పిలిపించి క్షమాపణలు చెప్పించడంతో వారు వెనుతిరిగారు.

 చితకబాదారంటూ ఆందోళన
 రామాయంపేట : విద్యార్థులను అకారణంగా ఉపాధ్యాయుడు చితకబాదారంటూ పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మండలంలోని నిజాంపేట ప్రాథమిక పాఠశాలలో శనివారం చోటుచేసుకుంది. వారి కథనం మేరకు.. నిజాంపేట ప్రాథమిక పాఠశాలలో గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే కొంత కాలంగా అతడు అకారణంగా విద్యార్థులను చితకబాదుతున్నాడు.

శుక్రవారం ఇదే విధంగా కొందరు విద్యార్థులను కొట్టాడు. ఈ విషయమై సదరు ప్రధానోపాధ్యాయుడితో మాట్లాడేందు కు వస్తే ఆయన శనివారం విధులు హా జరు కాలేదని వారు తెలిపారు. విద్యార్థులను అకారణంగా  కొట్టిన గోపాల్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎ మ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కొమ్మా ట సుధాకర్, కార్మిక సంఘం ప్రతినిధి తాడెం రవి, తెలంగాణ ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గర్గుల శ్రీనివా స్, గ్రామ వార్డు సభ్యురాలు మాలోన్‌బీ డిమాండ్ చేశారు. ఈ విషయమై గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుకుని బాగుపడాలని బెదిరించాను తప్ప  తాను ఎవరినీ కొట్టలేదన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement