గాయపడిన చిన్నారి సాయితేజ
మీర్‌పేట: హోంవర్క్ చేయలేదని ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థి చేతిపై ఐరన్ స్కేల్‌తో కొట్టడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జిల్లెలగూడ డీఎన్‌ఆర్ కాలనీకి చెందిన రమావత్ హత్తిరాం, అనిత దంపతుల కుమారులు మీర్‌పేటలోని సత్యం కిడ్స్ ప్లే స్కూలో చదువుతున్నారు. చిన్న కుమారుడు సాయితేజ(8) 3వ తరగతి చదువుతున్నాడు. గత నెల 31న పాఠశాలకు వెళ్లిన సాయితేజను సైన్స్ టీచర్ సుజాత హోంవర్క్ చేయలేదని ఐరన్ స్కేల్‌తో చేతివేళ్లపై కొట్టడంతో వాపు వచ్చింది. సాయంత్రం ఇంటికి వచ్చిన చిన్నారి ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు సాయితేజను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు పరీక్షించిన వైద్యులు వేళ్లు విరిగినట్లు తెలిపారు. టీచర్ సుజాతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హత్తిరాం బుధవారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
టీచర్‌పై చర్యలు తీసుకోవాలి..
చిన్నారి సాయితేజపై క్రూరంగా వ్యవహరించిన టీచర్ సుజాతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు డిమాండ్ చేశారు. టీచర్‌ను అరెస్ట్ చేయాలని మీర్‌పేట సీఐని కోరారు. సత్యం కిడ్స్ ప్లే స్కూల్‌కు గుర్తింపు లేదని, వెంటనే పాఠశాలను మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment