
రాయచూరు రూరల్: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన జిల్లాలోని మస్కిలో చోటు చేసుకుంది. కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని అగోలికి చెందిన మల్లనగౌడ(34) మస్కి పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రక్తపోటు, చక్కెర వ్యాధులతో బాధపడుతున్న ఇతను శుక్రవారం రాత్రి నిద్రలో ఉండగానే మరణించినట్లు తెలిసింది.