
దాడి చేస్తున్న దృశ్యం
దాడి వీడియో వైరల్ అయ్యింది.
కర్ణాటక: గొడవను విడిపించడానికి వెళ్లిన కానిస్టేబుల్‌పై దాడి జరిగిన ఘటన హాసన జిల్లా సకలేశపుర తాలూకా ఎస్ హొన్నేనహళ్లి గ్రామంలో జరిగింది. శరత్ యసళూరు పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. గురువారం శరత్ సెలవు పెట్టి అదే గ్రామానికి చెందిన దీపక్ కుటుంబంతో కలిసి హొళెనరసిపుర తాలూకా మాకలి దేవస్థానానికి వెళ్లారు.
మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో మిథున్, లోహిత్, నటరాజులు కలిసి చేతన్ అనే యువకున్ని కొట్టసాగారు. అక్కడే ఉన్న శరత్ వీరిని విడిపించడానికి వెళ్లగా నటరాజ్ ఆనే యువకుడు శరత్ తలపై బండరాయితో మోదాడు. ఆపై కారులో ఉన్న లాంగును తెచ్చి దాడి చేశారు.
భయపడిన శరత్ సమీపంలోని కన్వెన్షన్ హాల్‌లోకి పరుగులు తీశారు. అక్కడ వదలకుండా లాంగ్‌తో దాడి చేశారు. గాయాలైన శరత్ కుప్పకూలగా దుండగులు పరారయ్యారు. బాధితున్ని స్థానికులు హాసన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హొళెనరసీపుర నగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దాడి వీడియో వైరల్ అయ్యింది.