శ్రీశైలం డ్యాంను ముట్టడించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 69 రద్దు చేయాలనే డిమాండ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీశైలం డ్యామ్‌ను ముట్టడించారు. రైతుల శ్రేయస్సు కోసం, కర్నూలు జిల్లాకు తాగునీరు అందించేందుకు ఎంతకైనా పోరాటం కొనసాగిస్తామని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.
శ్రీశైలం నీటిమట్టం 854 అడుగులు ఉండేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విజ్క్షప్తి చేశారు. కృష్ణా వాటర్ బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.