కర్నూలు : జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదుకావడం దురదృష్టకరమని ఎమ్యెల్యే హఫీజ్‌ఖాన్ అన్నారు. కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తుందని, అయితే టీడీపీ నేతలు మాత్రం కరోనాను కూడా రాజకీయాల కోసం వాడుకోవడం దుర్మార్గమన్నారు. ఎల్లో మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మతాల మధ్య చిచ్చుపెట్టేలా టీడీపీ నేతలు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇటీవల ముస్లిం పెద్దలకు చికిత్స అందిస్తున్న నర్సును అవమానిస్తూ టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని మాట్లాడాలని కోరారు. ప్రపంచం మొత్తం కరోనాపై పోరాడుతుంటే టీడీపీ నేతల మాత్రం కులాలు, మతాల మధ్య విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇకనైనా ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని హఫీజ్‌ఖాన్ హితవు పలికారు.
హాఫీజ్ ఖాన్‌పై దుష్ప్రచారం.. వాస్తవం ఇది
.
Comments
Please login to add a commentAdd a comment