కర్నూలు.. ఫ్యాన్‌ జోరు! | Predictions Of Victory For YSRCP In Elections In The Combined Kurnool District, Details Inside | Sakshi
Sakshi News home page

AP Assembly Elections 2024: కర్నూలు.. ఫ్యాన్‌ జోరు!

Published Mon, May 6 2024 11:31 AM | Last Updated on Mon, May 6 2024 12:52 PM

Predictions Of Victory For YSRCP In Elections In The Combined Kurnool District

ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి తిరుగులేని గాలి

గత సార్వత్రిక పోరులో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను క్లీన్‌ స్వీప్‌ చేసిన వైఎస్సార్‌సీపీ

ఈ దఫా కూడా అవే ఫలితాలు పునరావృతమవుతాయనే ధీమాలో ఆపార్టీ శ్రేణులు

పొత్తుతో నష్టం జరుగుతోందని కర్నూలులో బీజేపీని దూరం పెట్టిన టీజీ

ఆదోని, మంత్రాలయం, కోడుమూరు, ఎమ్మిగనూరులో టీడీపీలో ఇంటిపోరు

ఆదోనిలో నామమాత్రపు పోటీకి పరిమితమైన బీజేపీ

మరోసారి జగన్‌ను సీఎంగా చూడాలని కలిసికట్టుగా శ్రమిస్తోన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

సాక్షి ప్రతినిధి కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో సార్వత్రిక పోరు ఏకపక్షంగా కానుందా? 2019 ఫలితాలే పునరావృతం కాను న్నాయా? 2 ఎంపీలతో పాటు 14 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేయనుందా? అంటే జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, పారీ్టల బలాబలాలు విశ్లేíÙస్తే అవుననే తెలుస్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ పట్ల ప్రజల్లో విశ్వసనీయత, ఇటీవల సీఎం జగన్‌ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం, ఆచరణ సాధ్యమయ్యే హామీలతో విడుదల చేసిన మేనిఫెస్టోకు ప్రజల మద్దతు రావడం వంటి అంశాలతో వైఎస్సార్‌సీపీ జోష్‌లో ఉంటే, చంద్రబాబు సభలకు సరైన స్పందన లేకపోవడం, చాలా నియోజకవర్గాల్లో నాయకత్వలేమి, వర్గ విభేదాలతో  టీడీపీ ఈ దఫా కూడా బోణీ కొట్టడం కష్టమేననే భావన విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి అత్యంత బలంగా ఉంది. ఈ ఐదేళ్లలో ప్రతి ఇంటికీ చేయని సంక్షేమ ఫలాలు అందాయి. ప్రతీ గ్రా మంలో అభివృద్ధి జరిగింది. దీనికి తోడు తమ నాయకు డిని మరోసారి సీఎంగా చూడాలనే ఆ కాంక్ష ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది.

కర్నూలులో గెలుపు గ్యారంటీ..
రాష్ట్రంలోనే మైనార్టీ ఓట్లు అత్యధికంగా (1.15లక్షలు) ఉండే నియోజకవర్గం కర్నూలు. ఇక్కడ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ను వైఎస్సార్‌సీపీ బరిలోకి దింపింది.ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డితో పాటు పార్టీ మొత్తం ఇంతియాజ్‌ గెలుపు కోసం పని చేస్తోంది. మైనారీ్టలంతా వైఎస్సార్‌సీపీ వైపు నిలబడ్డారు. మరోవైపు టీజీ వెంకటేశ్‌ బీజేపీలో, భరత్‌ టీడీపీలో కొనసాగుతూ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. రాజకీయాన్ని కూడా ‘బిజినెస్‌’గా చూసే టీజీ కుటుంబాన్ని గత రెండు దఫాలు ప్రజలు ఓడించారు. మైనార్టీ ఓట్లు దూరమవుతాయనే భావనతో బీజేపీని టీజీ భరత్‌ దగ్గరకు రానీయడం లేదు. దీంతో బీజేపీ నేతలు కూడా టీజీపై గుర్రుగా ఉన్నారు.  

కోడుమూరులో సునాయాసమే..
కోడుమూరు(ఎస్సీ) టీడీపీలో గ్రూపు తగాదాలతో ఎన్నికలు ఏకపక్షంగా జరిగే అవకాశం ఉంది. తనకు కాకుండా బొగ్గుల దస్తగిరికి టికెట్‌ ఇచ్చారని ఇన్‌చార్జ్‌ ఆకేపోగు ప్రభాకర్‌ ఏకంగా ఆత్మహత్యకు యత్నించారు. తన ప్రమేయం లేకుండా ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి సూచించిన అభ్యరి్థకి టికెట్‌ ఇవ్వడంతో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వర్గం దస్తగిరికి సహకరించడం లేదు. ఇటీవల సయోధ్య కుదిరినట్లు చెబుతున్నా సహకారం లేదు. మరోవైపు కోట్ల హరిచక్రపాణిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి ఇటీవలే వైఎస్సార్‌సీపీలో చేరారు. దీంతో వైఎస్సార్‌సీపీ బలం మరింత పెరిగింది.ఈ దఫా కూడా వైఎస్సార్‌సీపీకే అనుకూలంగా ఉంది.  

‘ఆలూరు’లో పెరిగిన వైఎస్సార్‌సీపీ బలం
ఆలూరులో చిప్పగిరి జెడ్పీటీసీ వాలీ్మకి నేత విరూపాక్షి వైఎస్సార్‌సీపీ తరపున బరిలో ఉన్నారు. ఐదేళ్లు మంత్రి పదవి అనుభవించి పార్టీని వీడి వెళ్లిపోయిన గుమ్మనూరు జయరాం సిఫార్సుతో ఇక్కడ వీరభద్రగౌడ్‌కు టికెట్‌ ఇచ్చింది. దీంతో ఇక్కడ వాలీ్మకులంతా ఏకమయ్యారు. దీనికి తోడు టీడీపీ నుంచి వైకుంఠం మల్లిఖార్జున చౌదరి, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, కురబ వర్గానికి చెందిన శశికళ వైఎస్సార్‌సీపీలో చేరారు. కోట్ల హరిచక్రపాణిరెడ్డి కోడుమూరుతో పాటు ఆలూరుపై పట్టున్న నాయకుడు. ఇక్కడ కురబ, బోయ వర్గాలు వైఎస్సార్‌సీపీతోనే ఉన్నాయి. దీంతో కచి్చతంగా గెలుస్తామనే భావనలో వైఎస్సార్‌సీపీ ఉంది.  

శ్రీశైలంలో శివతాండవమే..
శ్రీశైలంలో శిల్పా చక్రపాణిరెడ్డి వైఎస్సార్‌సీపీ తరఫున బరిలో ఉన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు. టీడీపీ నేత బుడ్డా రాజశేఖరరెడ్డి నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదాల్లో ఉంటున్నారు. ఓటమి భయంతోనే బుడ్డా ఇలా వ్యవహరిస్తున్నారనే చర్చ నడుస్తోంది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా గెలిచి, టీడీపీలోకి వెళ్లి ప్రజల్లో బుడ్డా విశ్వసనీయత కోల్పోయారు. దీంతో టీడీపీ నేతలు కూడా ఇతని కోసం గట్టిగా పని చేసే పరిస్థితులు లేవు. ఏరాసు ప్రతాప్‌రెడ్డి కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.  

‘పోచా’దే నంద్యాల!
నంద్యాల ఎంపీ అభ్యరి్థగా పోచా బ్రహ్మానందరెడ్డి బరిలో ఉన్నారు. సిట్టింగ్‌ ఎంపీ. ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడటంతో పాటు ఇటు పార్టీ నేతలతో అటు పార్లమెంట్‌ పరిధిలోని ప్రజలతో మంచిగా ఉన్నారు. మరోవైపు టీడీపీ వేండ్ర శివానందరెడ్డిని కాదని, చివరి నిమిషంలో బీజేపీ నేత బైరెడ్డి శబరికి ‘పచ్చ కండువా వేయించి ఎంపీగా పోటీ చేయిస్తోంది. బైరెడ్డి రాజశేఖరరెడ్డి 2014లోనే ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. పైగా బైరెడ్డిని టీడీపీ నేతలే స్వాగతించడం లేదు. పార్లమెంట్‌లోని అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ హవానే ఉంది. అసెంబ్లీలు స్వీప్‌ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నంద్యాల మరోసారి పోచా వశం కానుంది.  

పత్తికొండలో టీడీపీ పరాభవం తథ్యం!
పత్తికొండలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి నిత్యం జనంతో మమేకం అవుతున్నారు. మరోవైపు మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు ఐదేళ్లపాటు పారీ్టకి అందుబాటులో లేరు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ కూడా వీరికి దూరంగా ఉన్నారు. ఇక్కడ టీడీపీ గెలుపు అవకాశాలు స్వల్పమే.

ఎమ్మిగనూరు.. ఏకపక్షం!
ఎమ్మిగనూరులో చేనేత వర్గానికి చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుక వైఎస్సార్‌సీపీ తరఫున బరిలో ఉన్నారు. బీసీలకు టికెట్‌ ఇవ్వాలని సీనియర్‌ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని పక్కనపెట్టారు. దీంతో ఇక్కడ చేనేతలు, బీసీలు రేణుక కోసం ఏకమయ్యారు. చెన్నకేశవరెడ్డి కూడా రేణుక గెలుపు కోసం శ్రమిస్తున్నారు. మరోవైపు జయనాగేశ్వరరెడ్డికి కోట్ల వర్గం నుంచి కూడా మద్దతు లేదు. ఇక్కడ కూడా ‘బుట్టా’కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మంత్రాలయం, ఆదోనిలో మురిపిస్తున్న ఫ్యాన్‌..
మంత్రాలయం నియోజకవర్గ ఆవిర్భావం నుంచి బాలనాగిరెడ్డికి ఓటమి లేదు. నిత్యం ప్రజల్లో ఉండే రాజకీయనేత. మరోవైపు తిక్కారెడ్డిని కాదని, బోయ వర్గానికి చెందిన రాఘవేంద్రకు టీడీపీ  టికెట్‌ ఇచి్చంది. దీనిపై తిక్కారెడ్డి ప్రత్యక్షంగా నిరసన చేశారు. దీంతో జిల్లా అధ్యక్షపదవి ఇతనికి కట్టబెట్టింది. అయినా రాఘవేంద్రకు సహకరించడం లేదు. మరోవైపు తన అధ్యక్ష పదవిని తీయడంపై బీటీ నాయుడు గుర్రుగా ఉన్నారు. ఆదోనిలో టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న మీనాక్షి నాయుడును కాదని పొత్తులో భాగంగా బీజేపీకి టికెట్‌ ఇచ్చారు. ఇక్కడ టీడీపీ, బీజేపీ రెండూ బలహీనంగా ఉన్నాయి. దీంతో బీజేపీ కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితి.

గెలుపు బాటలో ‘రామయ్య’ 
కర్నూలు వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా బీవై రామయ్య పోటీ చేస్తున్నారు. పేద వ్యక్తి. పార్లమెంట్‌లో బలమైన ‘వాల్మీకి’ వర్గానికి చెందిన నేత. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పని చేసిన అనుభవంతో పార్లమెంట్‌లో విస్తృత పరిచయాలున్నాయి. రామయ్య తెలియని వ్యక్తి లేరు. అజాత శత్రువైన రామయ్యకు ‘వాలీ్మకుల’తో పాటు అన్ని వర్గాల నుంచి మద్దతు ఉంది. 7 అసెంబ్లీలలో ‘ఫ్యాన్‌’ గాలి వీస్తోంది. మరోవైపు టీడీపీకి అభ్యర్థులు లేక పంచలింగాల నాగరాజు అనే రియల్టర్‌ను చివరి నిమిషంలో తీసుకొచ్చారు. ఆయనెవరో కూడా జిల్లా ప్రజలకు తెలీదు. వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌లో అత్యంత బలంగా ఉండటం, బలమైన సామాజిక వర్గం, మంచితనం వెరసి రామయ్య గెలుపు నల్లేరుపై నడకే అనే చర్చ సర్వత్రా నడుస్తోంది.

డోన్, పాణ్యంలో దూకుడు!
డోన్‌లో టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని చంద్రబాబు రెండేళ్ల కిందటే ప్రకటించారు. అయితే సుబ్బారెడ్డి ఓడిపోతాడని సర్వేలో తేలడంతో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని బరిలోకి దించారు. యూరోపియన్‌ మోడల్‌ విద్యాసంస్థలతో పాటు అన్ని రకాలుగా మంత్రి బుగ్గన డోన్‌ను అభివృద్ధి చేశారు. 2009 ఓటమి తర్వాత కోట్ల కుటుంబం డోన్‌ను వదిలేసింది. ఇప్పుడు ప్రకాశ్‌రెడ్డిని పంపింది. ఇష్టం లేకపోయినా డోన్‌కు వెళుతున్నారని ప్రకాశ్‌రెడ్డి కోడుమూరు కార్యకర్తల సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక్కడ బుగ్గన గెలుపు లాంఛనమే అని విశ్లేషకులు చెబుతున్నారు. పాణ్యంలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ తరఫున, గౌరు చరిత టీడీపీ అభ్యరి్థగా బరిలోకి దిగుతున్నారు. జిల్లాలో సీనియర్‌ ఎమ్మెల్యే కాటసాని. నిత్యం ప్రజల్లో ఉంటారు. బైరెడ్డి, గౌరు ఏకం కావడం గౌరు వర్గీయులు కూడా జీరి్ణంచుకోలేకపోతున్నారు. ఇక్కడ ఈ దఫా కూడా కాటసానికే అనుకూలంగా ఉంది.  

నంద్యాలలో గెలుపు నల్లేరుపై నడకే..
నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి సౌమ్యుడు. రవితోపాటు ఆయన తండ్రి ఎప్పుడూ ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు. ఎవరు వెళ్లినా స్పందించే గుణం వారి సొంతం.  మరో వైపు భూమా బ్రహ్మానందరెడ్డిని కాదని ఫరూక్‌కు టీడీపీ టికెట్‌ ఇచి్చంది. దీంతో బ్రహ్మం పూర్తి దూరంగా ఉన్నారు. నంద్యాలపై పట్టున్న అఖిలప్రియ కూడా ఫరూక్‌కు సహకరించలేదు. ఈ దఫా ఫరూక్‌ ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్‌ తన తమ్ముడు జగత్‌ విఖ్యాత్‌కు ఇప్పించాలనేది అఖిల వ్యూహం. దీంతో వర్గవిభేదాలతో టీడీపీ నలిగిపోతోంది.  

బనగానపల్లిలో బోనస్‌ మార్కులే..
బనగానపల్లిలో కాటసాని రామిరెడ్డి బలంగా ఉన్నారు. ఇక్క డ టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్‌రెడ్డి నియోజకవర్గం కంటే హైదరాబాద్‌లో ఎక్కువగా ఉంటారు. దీనికి తోడు డోన్, నంద్యాలలో తన వర్గానికి టికెట్లు ఇప్పించుకునే క్రమంలో కోట్ల, భూమాకు ప్రత్య ర్థిగా మారారు. ఈ ఎన్నికల్లో వీరు ఇతని ఓటమి కోసం పని చేసే అవకాశం ఉంది. బీసీపై భూమా బ్రహా్మనందరెడ్డి ఏకంగా చంద్రబాబుకే ఫిర్యాదు చేశారు. ఇక్కడ కాటసానికి గెలుపు అవకాశాలు ఎక్కువ.  

నందికొట్కూరులో తిరుగులేని ఫ్యాన్‌!
నందికొట్కూరులో వైఎస్సార్‌సీపీ తరఫున సు«దీర్‌ పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు కోసం బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి శ్రమిస్తున్నారు. టీడీపీ తరఫున గిత్తా జయసూర్య పోటీ చేస్తున్నారు. ఇక్కడ మాండ్రను కాదని నంద్యాల ఎంపీ బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమారై శబరికి ఇచ్చారు. మాండ్ర హైదరాబాద్‌లో ఉంటున్నారు. దీంతో జయసూర్య ఒంటరైపోయాడు. దశాబ్దాలుగా ఫ్యాక్షన్‌  నడిపిన గౌరు, బైరెడ్డి వర్గాలు ఏకం కావడం కూడా నందికొట్కూరులో జీరి్ణంచుకోలేని అంశం. దీంతో అంతా వైఎస్సార్‌సీపీ వైపు నిలబడ్డారు.  

ఆళ్లగడ్డలో అఖిలకు ఎదురుగాలి..
ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ తరచూ వివాదాలలో చిక్కు కుంటోంది. కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా దూరమయ్యారు. ‘భూమా’ ప్రధాన అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి అఖిల ఓటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. గంగుల బ్రిజేంద్రారెడ్డి, గంగుల ప్రభా కర్‌ రెడ్డి ఇద్దరూ ఆళ్లగడ్డలో ‘ఫ్యాక్షన్‌ ’ వాతావరణాన్ని తీసేసి ప్ర శాంతంగా మార్చారు. ఇదే వీరికి ఈ ఎన్నికల్లో బలంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement