'అఖిలపక్ష భేటీ కేవలం కంటితుడుపు చర్య' | No change in stand over United Andhra Pradesh, says Mysura Reddy | Sakshi
Sakshi News home page

'అఖిలపక్ష భేటీ కేవలం కంటితుడుపు చర్య'

Published Tue, Nov 12 2013 12:53 PM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

'అఖిలపక్ష భేటీ కేవలం కంటితుడుపు చర్య' - Sakshi

'అఖిలపక్ష భేటీ కేవలం కంటితుడుపు చర్య'

హైదరాబాద్ : అఖిలపక్ష సమావేశం కేవలం కంటి తుడుపు చర్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన జీవోఎంతో భేటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మైసూరారెడ్డి, గట్టు రామచంద్రరావు మంగళవారం ఢిల్లీ బయల్దేరారు. ఈ సందర్భంగా మైసూరారెడ్డి మాట్లాడుతూ విభజన అంశం కాంగ్రెస్ సొంతింటి వ్యవహారంగా భావిస్తుందన్నారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జీవోఎంలో  స్పష్టం చేస్తామని మైసూరారెడ్డి తెలిపారు. సోనియా ఆదేశాలు అమలు చేయడమే జీవోఎం అజెండా అని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంతమంది వెళ్లినా ....ఎక్కడకి వెళ్లినా సమైక్యమే తన నినాదమని మైసూరారెడ్డి స్పష్టం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement