మిగులు జలాల మీద ఆధారపడి నిర్మిస్తున్న ప్రాజెక్టుల జాతకాలు తేల్చిన తరువాతనే..రాష్ట్ర విభజన గురించి మాట్లాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎం.వి.మైసూరా రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : మిగులు జలాల మీద ఆధారపడి నిర్మిస్తున్న ప్రాజెక్టుల జాతకాలు తేల్చిన తరువాతనే..రాష్ట్ర విభజన గురించి మాట్లాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎం.వి.మైసూరా రెడ్డి చెప్పారు. ప్రపంచంలో మిగులు జలాల మీద ఆధారపడి నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఎక్కడా లేవన్నారు.
రాష్ట్ర విభజనపై జాతీయ పత్రిక హిందూ నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన...రాష్ట్ర విభజన ప్రక్రియపై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గాదె వెంకటరెడ్డి, టీఆర్‌ఎస్ నుంచి కేటీఆర్, సీపీఎం నుంచి బీవీ రాఘవులు, సీపీఐ నుంచి నారాయణ, లోక్ సత్తా నుంచి జయప్రకాష్ నారాయణ్ పాల్గొని రాష్ట్ర విభజనపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. టీడీపీని ఆహ్వానించినప్పటికీ..ఆ పార్టీకి చెందిన వారెవ్వరూ ఈ సమావేశానికి హాజరు కాలేదు.