వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం వాయిదావేశారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజు ఈ నెల 8న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఈ సమావేశం వాయిదా వేసినట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ఎంవి మైసూరా రెడ్డి చెప్పారు. ప్లీనరీ జరిగే తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. పార్టీ నాయకురాలు షర్మిల నిర్వహించే మరో ప్రజా ప్రస్తానం పాదయాత్ర యథావిథిగా జరుగుతుందని ఆయన తెలిపారు. వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆయన కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ఆ రోజున రక్తదానం, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.