'ప్రభుత్వం విఫలం - రాష్ట్రపతిపాలనకు డిమాండ్' | Mysura Reddy demand for President's rule | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వం విఫలం - రాష్ట్రపతిపాలనకు డిమాండ్'

Published Sat, Jul 5 2014 4:55 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

'ప్రభుత్వం విఫలం - రాష్ట్రపతిపాలనకు డిమాండ్' - Sakshi

'ప్రభుత్వం విఫలం - రాష్ట్రపతిపాలనకు డిమాండ్'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిక్షరణలో ఘోరంగా విఫలమైందని, రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ఆర్ సిపి సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు మైసూరా రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ అధ్యక్షుని ఎన్నిక సందర్భంగా  ఒంగోలులో ఓటర్లు కానివారు కూడా ఎన్నికల హాలులోకి ఎలా వెళ్లారు? అని ప్రశ్నించారు.  చంద్రబాబు ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడలేకపోతోందన్నారు. టీడీపీ సర్కారు అధికారంలో కొనసాగే అర్హత కోల్పోయిందని చెప్పారు. ఈ  ప్రభుత్వాన్ని తక్షణం బర్తరఫ్‌ చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతిని కోరతామని చెప్పారు.

నెల్లూరు, ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలను ఈ రోజే  నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం వ్యవహార తీరు సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. అధికార దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తోందని, ప్రజాస్వామ్యమంటే ఇదేనా? అని ప్రశ్నించారు. నెల్లూరు, ప్రకాశం, కర్నూలు ఘటనలపై డీజీపీకి  ఫిర్యాదు చేసినట్లు మైసూరారెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement