
అవిశ్వాసానికి మద్దతిస్తున్నాం: మైసూరా
అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైసూరారెడ్డి స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ : అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైసూరారెడ్డి స్పష్టం చేశారు. గత సమావేశాల్లోనూ నేరుగా తాము అవిశ్వాస తీర్మానం పెట్టామని ఆయన బుధవామిక్కడ తెలిపారు. స్పీకర్ అనుమతి కోరే సమయంలో తాము లేచి మద్దతు తెలుపుతామన్నారు.
అడ్డగోలు విభజనను వ్యతిరేకిస్తూ రాష్ట్ర సమైక్యతను కాంక్షిస్తూ దేశమంతా పర్యటించి అన్ని పార్టీల నేతలను కలిశామన్నారు. అసెంబ్లీ కూడా తెలంగాణ బిల్లును తిరస్కరించిందని మైసూరారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ రోజు సాయంత్రం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి తెలంగాణ ముసాయిదా బిల్లును పార్లమెంట్కు పంపొద్దని విజ్ఞప్తి చేస్తామన్నారు.