ఆ పార్టీలతో వేదిక పంచుకోం: మైసూరారెడ్డి | Mysura Reddy Letter to Ashok Babu | Sakshi
Sakshi News home page

ఆ పార్టీలతో వేదిక పంచుకోం: మైసూరారెడ్డి

Published Fri, Dec 20 2013 4:08 PM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

ఆ పార్టీలతో వేదిక పంచుకోం: మైసూరారెడ్డి - Sakshi

ఆ పార్టీలతో వేదిక పంచుకోం: మైసూరారెడ్డి

హైదరాబాద్: సమైక్య పరిరక్షణ వేదిక ఈ నెల 21న ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. ఈ మేరకు  ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుకు వైఎస్‌ఆర్‌ సీపీ నేత మైసూరారెడ్డి లేఖ రాశారు. అఖిలపక్ష సమావేశానికి తమ పార్టీని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

విలువలు, విశ్వసనీయత కలిగిన రాజకీయాలను అనుసరించే పార్టీగా... తమ పార్టీ రెండు పడవల మీద ప్రయాణాన్ని వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. అసెంబ్లీలో, పార్లమెంట్‌లో ప్రాంతాలవారీగా సభ్యుల్ని ఎగదోస్తున్న కాంగ్రెస్‌, టీడీపీలను చూస్తూనే ఉన్నామని తెలిపారు. సమైక్యవాదానికి కట్టుబడని ఆ పార్టీలతో తాము వేదిక పంచుకోబోమని స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఇలాంటి సమావేశాలను హర్షించరని లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement