మొదటిదశ పంచాయతీ ఎన్నికల్లో తామే నెంబర్‌వన్ అని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత మైసూరారెడ్డి అన్నారు. ప్రాంతాలవారీగా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయో వివరాలతో లిస్టు విడుదల విడుదల చేశారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్.. 30 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీతో దీటుగా రెండేళ్ల వయస్సున్న వైఎస్ఆర్ సీపీ ఫలితాలు సాధించడం మామూలు విషయం కాదన్నారు. మిగిలిన పార్టీలు గెలిచిన అభ్యర్థులను ప్రకటిస్తే తాము కూడా అందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. లిస్టుతో రెడీగా ఉన్నామని చెప్పారు. పార్టీ గుర్తుపై జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో ఎలక్షన్ కమిషన్ తేలుస్తుందని అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష నేత.. ప్రజల పక్షాన ఉన్న పార్టీని నిలదీయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అవనిగడ్డ ఉపఎన్నికపై అంబటి బ్రాహ్మణయ్య కుటుంబ సభ్యులు అభ్యర్థిస్తే తమ పార్టీ అధ్యక్షుడితో చర్చించి పోటీ చేయలా, వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని మైసూరారెడ్డి చెప్పారు.