
రాజకీయ శూన్యత ఊహించలేదు: మైసూరా
వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకు మూడు దశాబ్దాల బంధముందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరారెడ్డి తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం వైఎస్‌ఆర్ నిరంతరం పరితపించేవారని గుర్తు చేసుకున్నారు. గొప్పనాయకుడు వీడి వెళ్లినపుడు రాజకీయ శూన్యత ఏర్పడుతుందన్నారు.
వైఎస్‌ఆర్ మరణంతో రాజకీయ శూన్యత ఉంటుందని భావించినా ఈ స్థాయిలో ఉంటుందని ఊహించలేకపోయామని చెప్పారు. అలాంటి సమర్ధుడైన నేతను కోల్పోవడం మన దురదృష్టమని మైసూరా రెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగో వర్థంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మహానేతకు మైసూరారెడ్డి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ మరణం తర్వాత రాష్ట్రం ముక్కచెక్కలయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా వైఎస్ఆర్ వర్థంతి రోజున ఆయన తనయ షర్మిల సమైక్య శంఖారావం యాత్ర మొదలుపెట్టడాన్ని ఆయన ప్రశంసించారు.