వైఎస్ఆర్సిపి అభ్యర్థులను బెదిరిస్తున్నారు:మైసూరా | Mysura Reddy Press Meet 14th July 2013 | Sakshi

Jul 14 2013 4:31 PM | Updated on Mar 21 2024 9:14 AM

స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులను అధికార కాంగ్రెస్ పార్టీ వారు బెదిరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్వవహారాల కమిటీ సభ్యుడు ఎం.వి.మైసూరా రెడ్డి చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను బెదిరిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు. నేర చరిత్రగల వారు ఎన్నికలలో పోటీచేయకుండా ఉండాలన్న ఉద్దేశం మంచిదేనన్నారు. అయితే సుప్రీం కోర్టు తీర్పును కూడా వక్రీకరించి చెబుతున్నారని పేర్కొన్నారు. పోలీసులు అధికారుల చేతిలో కోర్టు తీర్పు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ సిపి చేస్తున్న ఆందోళనకు విద్యార్థులు మద్దతు తెలపాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్కు ఖర్చు చేసే నిధులు దేశానికి పెట్టే పెట్టుబడిగా భావించాలన్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుకార్చే ప్రయత్నం చేస్తుందని, దానిని అడ్డుకోవడానికే ఈ ఉద్యమం చేపట్టినట్లు మైసూరా రెడ్డి తెలిపారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement