CM YS Jagan Slams Chandrababu Over Poor Lands Grave Comments - Sakshi
Sakshi News home page

ఆయన కోరుకున్న అమరావతి అలాంటిది మరి!.. బాబు ‘సమాధి’ వ్యాఖ్యలపై సీఎం జగన్‌ ఆవేదన

Published Mon, May 22 2023 12:49 PM | Last Updated on Mon, May 22 2023 4:57 PM

CM YS Jagan Slams Chandrababu Over Poor Lands Grave Comments  - Sakshi

సాక్షి, కృష్ణా:  దేవుడి యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్లు.. పేదల ఇళ్ల పంపిణీని అడ్డుకునే యత్నం చేశారని చంద్రబాబు నాయుడు తీరుపై సీఎం వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. పేదలకు పంచబోయే భూమిని సమాధులతో పోలుస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి మానవత్వం లేని, వికృత ఆలోచనలను ఉన్న వ్యక్తులకు మద్దతు ఇస్తారా? అంటూ సోమవారం మచిలీపట్నం బహిరంగ సభ ద్వారా ఏపీ ప్రజలను ఉద్దేశించి పిలుపు ఇచ్చారాయన. 

కొన్ని లక్షల కుటుంబాలకు స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అయినా ఇళ్లు లేదు. పేదవాడు పేదవాడిగా మిగిలిపోకూడదనేది మా ప్రభుత్వ ఆకాంక్ష. అందుకే అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని రెండేళ్ల కిందట నిర్ణయించాం. కానీ, చంద్రబాబు అండ్‌ దొంగల ముఠా దానిని అడ్డుకునే యత్నం చేసింది. అయినా అన్ని సమస్యలు, కోర్టు కేసులు అధిగమించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నామని తెలిపారు. పేదలకు ఏనాడూ సెంటు భూమి కూడా ఇవ్వని చంద్రబాబు నాయుడుకు.. వాళ్ల కష్టాలు ఎలా తెలుస్తాయని సీఎం జగన్‌ అన్నారు.

అమరావతిలో 50 వేలమంది పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశామని, ఈ నెల 26వ తేదీన స్థలాల పంపిణీ ఉంటుందని మచిలీపట్నం బహిరంగ సభలో ఆయన ప్రకటించారు. 

పేదలు పాచిపనులే చేయాలంట..
చంద్రబాబు.. గతంలో ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని అన్నాడు. బీసీల తోకలు కత్తిరించాలని అన్నాడు. కోడలు మగ పిల్లాడిని కంటే అత్త వద్దంటుందా అని అన్నాడు. మూడు రాజధానులు వద్దు అంటూ అన్ని ప్రాంతాల అభివృద్ధినే అడ్డుకున్నాడు.  మూడు ప్రాంతాలమీదే దాడిచేశాడు. పేదలంటే చంద్రబాబుకు చులకన. బాబు కోరుకున్న అమరావతి ఎలాంటిదంటే.. అందులో పేదలు కేవలం పాచిపనులు చేయాలంట. రోజూవారీ పనులు చేసే కార్మికులుగా మాత్రమే ఉండాలట. వాళ్లెవరికీ అక్కడ ఇళ్లు ఉండకూడదట. అమరావతిలో వీళ్ల పొద్దుటే ఎంటర్‌ కావాలంట, పనులు చేసి తిరిగి వెనక్కి పోవాలంట. ఇంతకన్నా సామాజిక అన్యాయం ఎక్కడైనా ఉందా? ఇలాంటి దారుణమైన మనస్తత్వం ఉన్న రాక్షసులతో యుద్ధం చేస్తున్నామ’ని పేర్కొన్నారాయన.  వారి వికృతఆలోచనలకు మద్దతు ఇవ్వగలమా? అని ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్‌ ప్రశ్నించారు. 

టీడీపీకి గజదొంగల ముఠా తోడైంది. ఆ ముఠాకు దోచుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం తప్ప ఏదీ తెలియదు. ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5 వీళ్లందరికీ తోడు ఓ దత్తపుత్రుడు.. వీళ్లందరూ ఈ మహాయజ్ఞానికి అడ్డుపడుతూ వచ్చారు. అమరావతిలో ప్రభుత్వ డబ్బుతో గేటెట్‌ కమ్యూనిటీ కట్టుకోవాలనుకున్నారు. బినామీల పేరుతో భూములుగడించి లక్షల కోట్లు దోచుకోవాలని ప్రయత్నించారు. పేదల ఇళ్లను దారుణంగా అడ్డుకుంటున​ ద్రోహి చంద్రబాబు. వీళ్లెవరూ పేదల వద్దకు వచ్చి మంచి చేశాం ఓట్లేయండిన అడిగే దమ్ములేదు. 

 చంద్రబాబు పేదవాడికి సెంటు భూమి కూడా పంచలేదు. పేదలకు ఈ ప్రభుత్వం ఇళ్లస్థలాలు ఇస్తుంటే.. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు కేసులు వేయించాడు. అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని సాక్షాత్తూ కోర్టులో కేసులు వేయించాడు. రూపం మార్చుకున్న అంటరాని తనానికి, నయా పెత్తందార్ల భావజాలానికి ప్రతీక ఈ చంద్రబాబు. ఇవన్నీ చేసిన చంద్రబాబు.. విశాఖ పట్నంలో అన్నమాలు బాధను కలిగిస్తున్నాయి. అమరావతి పరిధిలో ప్రతి పేదవాడికి 1.1 సెంటు భూమి ఇచ్చి, ఇల్లుకూడా ఉచితంగా కట్టించి ఇస్తే.. యాభైవేల మందికి కలలు సొంతం చేస్తుంటే.. దాన్ని ఈ గొప్ప పవిత్ర స్థలాన్ని చంద్రబాబు స్మశానంతో పోల్చాడు. పేదలకు తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక్క సెంటు స్థలం ఇవ్వలేదు. కానీ మనం ఇస్తే.. వాటిని సమాధులతో పోలుస్తున్నాడు అని సీఎం జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

► ఈ ప్రభుత్వంలో లంచాలు, వివక్షకు తావు లేకుండా పథకాలు అందుతున్నాయి. డీబీటీ ద్వారా రూ. 2.10 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారులకు అందించాం. నాన్‌ డీబీటీ ద్వారా రూ. 3 లక్షల కోట్లు లబ్ధిదారులకు అందించాం అని ప్రకటించారాయన. మంచి చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదు. ఫలానా మంచి పని చేశామని చెప్పుకోలేని పరిస్థితి వాళ్లది. వాళ్ల ఆలోచనలన్నీ.. కుళ్లు, కుతంత్రాలతో కూడుకున్నవే. అందుకే మంచి చేసిన మీ బిడ్డను(సీఎం జగన్‌ తనను తాను ఉద్దేశిస్తూ..) ఎన్నికల్లో గెలవడమే కష్టమంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం.. ప్రజల ప్రభుత్వం. పేదల తలరాతలను మార్చాలని నిర్ణయించామని,  ఆ ఆలోచనలకు అండగా నిలబడమని కోరుతున్నాం. మీ బిడ్డ ప్రజలనే నమ్మకున్నాడు. మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలవండి అంటూ మచిలీపట్నం వేదిక ద్వారా ఏపీ ప్రజలను కోరారాయన. 

ఇదీ చదవండి: బందరుకు చంద్రబాబు చేసిన ద్రోహం​ ఎలాంటిదంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement